Friday, May 10, 2024
- Advertisement -

వైకాపాలో వంగవీటి రాధా రచ్చ……… ఆ నాయకుడే కారణమా?

- Advertisement -

వంగవీటి రాధాకు ఇప్పుడు ప్రజాబలం ఎంత అంటే చెప్పడం కష్టమే. కానీ వంగవీటి ఫ్యామిలీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రాధాన్యత ఉంది. ఆ నేపథ్యంలో వంగవీటి వారసుడితో ఎలా డీల్ చేయాలి? సంప్రదింపుల వ్యవహారం ఎలా ఉండాలి? ఈ విషయంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో వ్యూహ వైఫల్యం కనిపిస్తోంది. చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయాన్ని రచ్చ రచ్చ చేశారు. ఆల్రెడీ సీనియర్ నేతల కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ కాపు నేతలందరికీ ఆఫర్స్ ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికే చాలా మంది సెకండ్ గ్రేడ్ కాపు నేతలు జనసేన వైపు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాపులకు బలమైన ప్రతినిధిగా ఉన్న వంగవీటి కుటుంబ వారసత్వ నేత వంగవీటి రాధా విషయంలో వైకాపా తప్పటడుగులపై విమర్శలు వస్తున్నాయి.

ప్రజా సంకల్ప యాత్రలో బిజీగా ఉన్న జగన్ కూడా తాజాగా ఇదే విషయంపై అధ్యయనం చేశాడని తెలుస్తోంది. వంగవీటి రాధా వ్యవహారాన్ని నేను డీల్ చేస్తానని చెప్పిన అంబటి రాంబాబును కాస్త ఘాటుగానే ప్రశ్నించాడట జగన్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైకాపా చేయించిన సర్వేలో బ్రాహ్మణ అభ్యర్థి, బలమైన నేత మల్లాది విష్ణు గెలుపు ఖాయం అని తేలిన మాట వాస్తవం. అందుకే మల్లాది విష్ణును అక్కడినుంచి పోటీ చేయించాలని ఆలోచన చేశారు. అన్నింటికీ మించి బ్రాహ్మణులందరూ కూడా ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో రెండు సీట్లు బ్రాహ్మణులకు ఇస్తానని మాట ఇచ్చాడు జగన్. ఇంతవరకూ వ్యవహారం అంతా సవ్యంగానే ఉంది. అయితే వంగవీటి రాధాను బుజ్జగించే బాధ్యత తీసుకున్న అంబటి రాంబాబు ఆ విషయంలో పూర్తిగా ఫెయిలయ్యాడని తెలుస్తోంది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఒక పర్యాయం గెలిచిన వంగవీటి 2014లో ఓటమి పాలయ్యాడు. అయితే ఇప్పుడు ఓడిపోయిన సానుభూతి కలిసొచ్చి 2019లో గెలిచే అవకాశాలు ఉన్నాయని వైకాపా అంచనా వేసింది. కానీ ఈ విషయంలో వంగవీటి రాధాను ఒప్పించడంలో, సర్ది చెప్పడంలో వైకాపా నాయకులు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అందుకే ఇప్పుడు జగన్ సూచనలతో స్వయంగా విజయసాయిరెడ్డి రంగంలోకి దిగాడని తెలుస్తోంది. ఆల్రెడీ జనసేన పార్టీతో టచ్‌లో ఉన్న వంగవీటి రాధా వైకాపాను వీడకుండా చేయడంలో విజయసాయిరెడ్డి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -