Sunday, May 5, 2024
- Advertisement -

మొద‌టి వికెట్ గ‌ణేష్ అవుట్‌…. మ‌రి రెండోది ఎవ‌రు

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో శ‌నివారం జ‌రిగిన ఎపిసోడ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శ‌నివారం ఎపిసోడ్ కొత్త త‌ర‌హాలో మొద‌లై, చివరికి రెండో ఎలిమినేషన్ సస్పెన్స్‌తో ముగిసింది. ప్ర‌తివారంలాగే ఈ వారం కూడా నాని హౌస్‌మోట్స్‌పై త‌న‌దైన స్టైల్లో చుర‌క‌లు అట్టించాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి కామ‌న్ మ్యాన్‌గా ఎంట్రి ఇచ్చిన గ‌ణేష్ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అంద‌రు ఊహించిన‌ట్లుగానే గ‌ణేష్ ఎలిమినేట్ అయ్యాడు. సీజన్ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న గణేశ్ఎలిమినేష‌న్ అవ్వ‌డం ఎవ‌రికి పెద్ద ఆశ్చ‌ర్యం క‌లిగించ లేదు. ఇక ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ అని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చాడు నాని.

దీంతో ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న సామ్రాట్, నూతన్‌ నాయుడు, అమిత్‌లో ఒకరు రేపు హౌస్‌ని వీడనున్నారు. కౌశల్‌ సేవ్ అయినట్లు నానీ ఈ రోజు ఎపిసోడ్ ఆఖర్లో వెల్లడించాడు. మ‌రి వీరి ముగ్గురిలో ఎవ‌రు బిగ్‌బాస్‌ను వ‌దిలి బ‌య‌ట‌కి వ‌స్తారో చూడాలి. మర్డర్- మిస్టరీ టాస్క్ కౌశల్‌ను టార్గెట్ చేసేందుకే అనే వార్తలు రావడాన్ని ఈరోజు ప్రస్తావించిన నానీ అలాంటిది ఏమీ లేదని వివరణ ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -