Thursday, May 9, 2024
- Advertisement -

త‌న మొద‌టి అనుభ‌వం గురించి చెప్పిన క‌ర‌ణ్ జోహార్‌

- Advertisement -

బాలీవుడ్ స్టార్ నిర్మాత‌ల‌లో ఒక‌రైన క‌ర‌ణ్ జోహార్ ఉన్న‌ది ఉన్న‌ట్లు మొహమాటం లేకుండా మాట్లాడేస్తాడు. ఈయన బ్యానర్ లో చిత్రాలు చేయాలని చిన్నా – పెద్దా హీరోలు కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. తాజాగా ఆయ‌న చేసిన కొన్ని కామెంట్స్ ద్వారా వార్త‌ల్లో నిలిచారు క‌ర‌ణ్‌. పెళ్లిపై త‌న‌కు మంచి అభిప్రాయం లేద‌ని,పెళ్లి అనేది సెక్స్ కోస‌మే చేసుకుంటున్నారని అప్ప‌ట్లో కామెంట్స్ చేశాడు క‌ర‌ణ్. తాజాగా ఆయ‌న త‌న మొద‌టి సెక్స్ అనుభ‌వం గురించి చెప్పుకొచ్చారు. తాను 26 ఏళ్ల వయస్సులో మొదటి సారి సెక్స్ అనుభవంను చవి చూశాను అంటూ చెప్పుకొచ్చాడు.

తన మొదటి సెక్స్ అనుభవం ఏమాత్రం సంతృప్తిని కలిగించలేదని డబ్బులిచ్చి సంతృప్తిని పొందాలని ప్రయత్నించిన తాను విఫలం అయ్యాను అని ఆ తర్వాత వారం రోజులకు మరోసారి ప్రయత్నించినా కూడా విఫలం అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. తాను ఎవరితో అయితే సెక్స్ కోరుకుంటానో వారితో కొంత కాలం డేటింగ్ చేసి ఆమెతో సన్నిహితంగా ఉంటాన‌ని చెప్పుకొచ్చాడు. ఇక క‌ర‌ణ్ సరోగస్సీ ద్వారా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తండ్రి అయిన సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -