Sunday, May 5, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో ఈ వారం గ‌ణేష్ అవుట్‌

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 2 ప్ర‌స్తుతం ప‌న్నెండో వారానికి చేరుకుంది. ఈ వారం కూడా ఒక‌రో ఇద్ద‌రో ఇంటిలోని స‌భ్యులు ఎలిమినేట్ అయ్యి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌బోతున్నారు. ఈ వారం ఎలిమినేష‌న్ల‌లో కౌశ‌ల్‌, నూత‌న్ నాయుడు, అమిత్ తివారీ, సామ్రాట్‌, గ‌ణేష్ ఉన్నారు. గ‌త సోమ‌వారం నుంచి ప‌డుతున్న ఓటింగ్‌ను బ‌ట్టి చూస్తే.. గ‌ణేష్ బ‌య‌ట‌కు వెళ్లిపోబోతున్న‌ట్టు స్ప‌ష్ట‌మైపోయింది. ఆన్‌లైన్ స‌ర్వే సంస్థ‌ల లెక్క‌ల ప్ర‌కారం.. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌డిన ఓటింగ్‌లో కౌశ‌ల్‌కు 50శాతం పైగా.. ఎప్ప‌టిలానే ప‌డింది. మిగ‌తా 50శాతంలో నూత‌న్ నాయుడికి 30శాతం, సామ్రాట్‌కు 12శాతం, అమిత్ తివారీకి ఐదు శాతం, గ‌ణేష్‌కు మూడు శాతం ఓటింగ్ ప‌డింది. అత్యంత త‌క్కువ ఓటింగ్ ప‌డిన గ‌ణేష్ ఈ వారం బ‌య‌ట‌కు వెళ్లిపోతాడు. అయితే.. ఈ వారం డ‌బ‌ల్ ఎలిమినేష‌న్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రిని బ‌య‌ట‌కు పంపాల్సి వ‌స్తే.. అమిత్ తివారీ సైతం డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్టే.

బిగ్‌బాస్ సీజ‌న్ 2 మ‌రో మూడు వారాల్లో ముగియ‌నుంది. 15 వారాల షోలో ఇప్ప‌టికే 12వారం న‌డుస్తోంది. త‌ర్వాత మ‌రో మూడు వారాలే ఉంటాయి. దీనిలోనూ రెండు వారాలే ఎలిమినేష‌న్లు ఉంటాయి. మూడో వారం ఫైన‌ల్ పోరులో విజేత ఎవ‌ర‌నేది తేలిపోతుంది. ప్ర‌స్తుతం హౌస్‌లో కౌశ‌ల్‌, త‌నీష్‌, సామ్రాట్‌, గీతామాధురి, అమిత్‌, రోల్‌రైడా, శ్యామ‌ల‌, దీప్తి న‌ల్ల‌మోతు, నూత‌న్ నాయుడు, గ‌ణేష్ ప‌ది మంది ఉన్నారు. వీరిలో ఐదుగురిని 12, 13, 14 వారాల్లో పంపించాల్సి ఉంటుంది. 15వ వారానికి చివ‌రిలో ఐదుగురిని ఉంచుతారు. వారిలో న‌లుగురిని ఫైనల్ రోజు ఎలిమినేష‌న్ చేసి.. చివ‌రిగా విజేత‌ను ప్ర‌క‌టిస్తారు. అంటే.. ఈ వారంతో పాటూ వ‌చ్చే రెండు వారాల్లో ఖ‌చ్చితంగా రెండు డ‌బ‌ల్ ఎలిమినేష‌న్లు ఉంటాయి. ఈ వారం గ‌ణేష్‌, అమిత్ తివారీ వెళ్లిపోతే.. ఇంకా ఎనిమిది మంది ఉంటారు. వారిలో రెండు వారాల్లో ముగ్గురిని పంపించేయ‌నున్నారు.

కౌశ‌ల్‌కే విజేత‌గా అవ‌కాశాలెక్కువ‌..
ప్ర‌స్తుతం బిగ్‌బాస్‌లో కౌశ‌ల్‌కే విజేత‌గా నిలిచే అవ‌కాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ కౌశ‌ల్ నామినేష‌న్ల‌లో ఉంటే.. ఖ‌చ్చితంగా 50శాతం నుంచి 70శాతం వ‌ర‌కూ ఓటింగ్ అత‌నికే ప‌డుతోంది. మిగ‌తా ఓటింగ్‌నే అంతా క‌లిసి పంచుకుంటున్నారు. కౌశ‌ల్ అభిమానుల సంఖ్య రోజు రోజుకూ మ‌రింత పెరుగుతోందే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. దీనికితోడు హౌస్‌లో ఉన్న మిగ‌తా కంటెస్టెంట్‌ల‌లో కౌశ‌ల్‌కు పోటీ ఇచ్చేవాళ్లు ఒక్క‌రూ లేరు. క‌నీసం ద‌రిదాపుల్లోనికి వ‌చ్చే వాళ్లూ లేరు. అంద‌రూ.. గ్రూపిజం, టైంపాస్ బ్యాచ్‌లానే క‌నిపిస్తున్నారు.. త‌ప్ప జ‌నంలో క్రేజ్ తెచ్చుకునే వాళ్లు లేరు. అదే కౌశ‌ల్ బ‌లం మ‌రింత పెరిగేలా చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -