Saturday, May 18, 2024
- Advertisement -

రాహుల్‌ ట్వీట్‌కు కౌంట‌ర్ ఇచ్చిన అమిత్ షా….

- Advertisement -

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్య‌వ‌హారంలో భాజాపా, కాంగ్రెస్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదిరి పాకాన ప‌డుతోంది.అందులో రాఫెల్‌ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలని అందుకు 24 గంట‌ల డెడ్‌లైన్ పెట్టారు రాహుల్‌. అంత‌కు ముందు రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ జైట్లీ విమర్శలు గుప్పించారు. ప్రియమైన జైట్లీ గారు.. మీకు నేను ఇచ్చిన డెడ్‌లైన్‌కు ఇంకా ఆరు గంటల కన్నా తక్కువ సమయమే ఉందని, మీ నిర్ణయం కోసం యువ భారతం ఎదురుచూస్తోందంటూ రాహుల్ మ‌రో సారి ట్వీట్ చేశారు.

రాహుల్ ట్వీట్‌కు భాజాపా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. ఇప్పటికే జేపీసీ (జూతీ పార్టీ కాంగ్రెస్‌) ఉందిగా.. అంటూ ‘అసత్యాలు ప్రచారం చేసే కాంగ్రెస్‌ పార్టీ’ అనే అర్థం వచ్చేలా ట్వీట్‌ చేశారు. అందుకు 24 గంటలు ఎందుకు? ఇప్పటికే ‘జూతీ పార్టీ కాంగ్రెస్‌’ (జేపీసీ) ఉందిగా?’ అని ట్వీట్‌ చేశారు. స్వార్థం కోసం జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారని, యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ఒక్కో చోట ఒక్కోలా మాట్లాడుతున్నారని రాహుల్‌పై మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -