Saturday, May 18, 2024
- Advertisement -

గుడ్డు కొట్టుకోరా గణేషా.. కౌశల్‌కి పగిలింది!

- Advertisement -

శ‌నివారం వ‌స్తే బిగ్‌బాస్ హౌస్‌లోకి నాని వ‌స్తాడు.నాని వ‌స్తే బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు పండుగే.బిగ్ బాస్ స్టేజ్‌పై హోస్ట్‌గా సందడి చేస్తున్న నాని శనివారం నాటి ఎపిసోడ్‌లో ఫుల్ ఎనర్జీ నింపారు. 91 ఎపిసోడ్‌లో నాని ముందుగా తనీష్ తనకు బర్త్ డే కానుకగా తన ముద్దుల చెల్లెలు దీప్తి సునయన పంచిన గ్రీటింగ్ కార్డ్, డాల్‌ని చూసి మురిపోయాడు. ఆయన బర్త్ డే సందర్భంగా.. అప్ కమింగ్ మూవీ ‘రంగు’ ట్రైలర్‌ను బిగ్ బాస్ హౌస్‌లో టెలికాస్ట్ చేశారు. ఇక నాని హౌస్‌మెట్స్‌కు ఈ వారం విచిత్ర‌మైన టాస్క్ ఇచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.ఈ వారం సరదా టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌తో ‘గుడ్డుకొట్టుకోరా గణేషా’ అనే సరదా టాస్క్ ఆడించారు నాని. ఈ టాస్క్ ప్రకారం కంటెస్టెంట్ ఒక్కరి గురించి వివిధ ప్రశ్నలు సిద్ధం చేశామని.. ఆ ప్రశ్నలకు కంటెస్టెంట్ ఇచ్చే సమాధానంతో మిగిలిన సభ్యులు ఇచ్చే సమధానం మ్యాచ్ కావాలని అలా కాని పక్షంలో తలపై గుడ్డు పగలకొట్టుకోవాలని.. ఒక్కరికి ఐదేసి ప్రశ్నల చొప్పున ఉంటాయంటూ టాస్క్ ఇచ్చారు నాని. ఈ టాస్క్‌లో ఒక్కొక్కరు యాక్టివిటీ రూంలోకి వెళ్లాల్సి ఉంటుంది.

వాళ్లకి ఎదురుగా గడ్లుతో పాటు ఎస్ ఆర్ నో బోర్డ్‌లు ఉంటాయి. నాని అడిగిన ప్రశ్నకు ఎస్ లేదా నో అనే బోర్డ్‌ను చూపించాలి. వీళ్ల అభిప్రాయం ఏకీభవిస్తూ బయట ఉన్న కంటెస్టెంట్ కూడా అదే బోర్డ్ చూపిస్తే గుడ్డు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. తొలితగా యాక్టివిటీ రూంలోకి వెళ్లిన దీప్తి ఒక్క గుడ్డుకూడా కొట్టుకోకుండా బయటకు వచ్చేసింది. ఆమెకు దీప్తి నామినేషన్స్‌లో లేకపోతే రిలాక్స్ అయిపోతుంది? సేఫ్ గేమ్ ఆడుతుంది? మంచి ఆర్టిస్ట్, ఆమెకు హౌస్‌లో ఉన్నవాళ్లతో గొడవలు లేవు లాంటి ప్రశ్నలు రావడంతో ఆమె అభిప్రాయంతో మిగిలిన కంటెస్టెంట్స్ ఏకీభవించారు. అనంతరం అమిత్, గీతా మాధురి రెండేసి గుడ్లు కొట్టుకోగా.. తనీష్, రోల్ రైడాలు ఒక్కోగుడ్డుతో సరిపెట్టేశారు. ఈ టాస్క్‌లో అందరికంటే ఎక్కువ గుడ్లు పగలకొట్టుకున్నారు కౌశల్. ఆయన అభిప్రాయంతో మిగిలిన సభ్యుల ఆన్సర్స్ మ్యాచ్ కాకపోవడంతో వరుసగా నాలుగు గుడ్లు తలపై కొట్టుకున్నారు. అనంతరం కౌశల్ మాదిరే యాంకర్ శ్యామల కూడా నాలుగు గుట్లు తలపై పగలకొట్టుకుంది. ఇక ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న దీప్తి, కౌశల్, అమిత్, శ్యామలలో ఎవరు సేఫ్ అయ్యారో రివీల్ చేస్తానంటూ బ్రేక్ తీసుకున్న నాని.. దీన్ని రేపటి ఎపిసోడ్‌కి వాయిదా వేశారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లోనే సేఫ్ అయ్యింది ఎవరు? ఎలిమినేట్ అయ్యిందెవరో తెలుసుకుందాం అంటూ కార్యక్రమాన్ని ముగించేశారు నాని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -