Saturday, May 4, 2024
- Advertisement -

కౌశ‌ల‌ను ఆయ‌న భార్య ఎలా భ‌రిస్తుందో…!

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ఇంత‌టి హిట్ అవ్వ‌టానికి ఎన్ని కార‌ణాలు అయిన ఉండ‌వ‌చ్చు కాని బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌ను ఇంత మంది ఇష్ట‌ప‌డానికి కార‌ణం మాత్రం కౌశ‌ల్ అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మూడో వారం కౌశ‌ల్‌ను ఒంట‌రి చేస్తు మిగ‌త స‌భ్యులు ఆడుతున్న గేమ్‌ను బ‌య‌ట నుంచి ప్రేక్ష‌కులు చూస్తునే ఉన్నారు. ఇక బిగ్‌బాస్ 90వ ఎపిసోడ్‌కు చేరుకున్న అత‌డిని ఒంటిరి చేయడం మాన‌లేదు ఇంటి స‌భ్యులు. ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో‘టిక్కెట్ టు ఫినాలే’ టాస్క్ న‌డిచింది. గార్డెన్ ఏరియాలో ఒక కారు ఉంచి.. ఆ కారులో ముందుగా వెళ్లి కూర్చున ఐదుగురు కంటెస్టెంట్‌ 24 గంటలు పాటు ఆ కారు నుండి కాలు కింద పెట్టకుండా కూర్చోవాలని ఫైనల్‌గా ఆ ఐదుగురిలో ఎవరైతే కిందకి దిగకుండా ఉంటారో వాళ్లు డైరెక్ట్‌గా బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు చేర‌తార‌ని ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది.

ఈ టాస్క్‌కు సంచాలకుడిగా కౌశ‌ల్ వ్య‌వ‌హ‌రించాడు. కారులో ఉన్న‌వారు కౌశ‌ల్ గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లు పెట్టారు. కౌశల్ బిగ్ బాస్ హౌస్‌లో ఏం చేస్తున్నారో నాకసలు అర్ధం కావడం లేదని గేమ్ ప్లాన్ ఏంటో నాకర్ధం కావడం లేదని తనీష్ అనండంతో కల్పించుకున్న దీప్తి , మొన్న గీతా మాధురి నేను ఇదే విషయం గురించి చర్చించుకున్నాం అని.. అతడిని ఆమె భార్య ఎలా ఉండగలుగుతుందో ఆమె ఓపికకు సహనానికి దండం పెట్టొచ్చంటూ చెప్పుకొచ్చింది దీప్తి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -