Thursday, May 9, 2024
- Advertisement -

నూత‌న్ నాయుడు బ‌దులు నన్ను బ‌య‌టికి పంపించ‌మ‌ని నాని గారిని అడిగాను – కౌశ‌ల్‌

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విన్న‌ర్ కౌశ‌ల్ రెండో వారంలోనే బ‌య‌టికి వ‌ద్దమ‌ని అనుకున్నాడ‌ట‌. అవును ఈ విష‌యాన్ని స్వ‌యంగా కౌశ‌లే చెప్పాడు.ఆదివారం నాడు ఓ టీవీ చ‌ర్చ కార్య‌క్ర‌మంలో పాల్గోన్న కౌశ‌ల్ బిగ్‌బాస్ గురించే కాకుండా త‌న వ్య‌క్తిగ‌త  విష‌యాల‌ను కూడా ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నాడు.ఈ సంద‌ర్భంగా కౌశ‌ల్ మాట్లాడుతూ… నేను రెండో వారంలోనే బ‌య‌ట‌కి వ‌చ్చేద్దమ‌ని అనుకున్నాను. ఇంట్లోని వాళ్లంతా ఏకమైనప్పుడు రెండవ వారంలోనే నాకు బయటికి వచ్చేయాలని అనిపించింది. బయట హాయిగా ఉండేవాళ్లం .. ఇక్కడికి వచ్చి మాటలు పడవలసిన అవసరం ఏవుంది? అనిపించింది.

రెండో వారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన నూత‌న్ నాయుడు స్థానంలో న‌న్న బ‌య‌ట‌కి పంపించ‌మ‌ని నానిగారిని అడిగాన‌ని చెప్పుకొచ్చాడు కౌశ‌ల్‌.అయితే నాని గారు మాత్రం నీకు బ‌య‌ట అభిమానులు గురించి తెలియడం లేద‌ని ,వారిని మోసం చేసి బ‌య‌ట‌కి వ‌స్తావా అని నానిగారు నన్ను ప్ర‌శ్నించ‌డంతో బ‌య‌టికి వ‌చ్చే ఆలోచ‌న‌ను విర‌మించుకున్నాన‌ని తెలిపాడు కౌశ‌ల్‌. ఇక ఈ కార్య‌క్ర‌మంలో కౌశ‌ల్ భార్య నీలిమా కూడా పాల్గోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -