Monday, May 6, 2024
- Advertisement -

మదనపల్లి పిల్ల …టమోటాలా మారిపోయిందే

- Advertisement -

మదనపల్లి టమోటాకు ఎంతటి మార్కెట్ ఉందో మనందరికీ తెలిసిందే. టమోటా అంటేనే మదనపల్లి అనేంతగా ఉంటుంది.ఎర్రని టమెటా నోరూరిస్తుంది.మరి అదే మదనపల్లికి చెందిన బిందు మాదవి గుర్తుంది కదా. అప్పట్లో మనకు తెలిసిన ఈ సుందరి నల్లగా ఉండేది.ఆతరువాత మేకప్ మేనియాలో పడి కాస్త చామన ఛాయ వచ్చింది. బట్ చూడగానే నాటు సరుకులా కనిపించే సరికి చిత్తూరుకు చెంతనే ఉన్న చెన్నై బ్యాచ్ ఆమెను ఎత్తుకు పోయింది.

అరవమేళానికి ఈ అమ్మడు తమ పిల్ల మాదిరిగా కనిపించే సరికి …పోన్లే పాపమని కరుణించేశారు. అంతే అవకాశాల మీద అవకాశాలు అమ్మడిని వెతుక్కుంటూ వచ్చాయి.దీంతో రెచ్చిపోయింది. సినిమాలు చేయడంలోనే కాదు…అందాలను ఆరబోయడంలోను. చేసింది చేసింది..అక్కడివారికి బోర్ కొట్టే టైమ్ కు కాస్త గ్యాప్ తీసుకుని..కొత్త తరం టమోటా పండులా నిగనిలలాడుతూ వచ్చింది.
దెబ్బకు అరవోడి అర్ధంకాకుండా పోయింది.

మనం లైఫ్ ఇచ్చిన మదనపల్లి పిల్లేనా ఈ బిందు మాదవి అని అందరూ ఆశ్చర్యపోయేలా తమారైంది. ఫొటోలు చూస్తున్నారు కదా. ఒకప్పటి బిందు మాధవి ఈమెనే అంటే ఎవరైనా నమ్ముతారా చెబుతారా చెప్పండి. దీనికి తోడు బూరియాట్రిక్ సర్జన్ చేసుకున్నవారిలా స్లిమ్ గా తయారైపోయింది. ఇంకా మంచిగా చెప్పాలంటే ఏదో అమీజాక్సన్ కు అక్కలా తయారైంది. నిర్మాతల ఆఫీస్ కు వెళ్తోన్న బిందును చూసిన జనాలు….ముందుగా ఆఫర్ ఇద్దామా లేక అందం చూద్దామా అని ఆలోచనలో పడిపోతున్నారట.మొత్తానికి టమోటాతో సాంబారును భలే కొట్టిందిలే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -