Sunday, May 5, 2024
- Advertisement -

గ‌ర్భ‌వ‌తి కాద‌ని తేల్చి చెప్పిన సెక్సీ భామ‌

- Advertisement -

పుకార్లు రాని సినీ న‌టులు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. వారిపై వ‌చ్చే పుకార్లు కొన్ని వాస్త‌వాలు కావొచ్చు.. మ‌రికొన్ని పుకార్లుగానే మిగిలిపోతాయి. అయితే ఇటీవ‌ల ఓ బాలీవుడ్ సెక్సీ భామపై వ‌చ్చిన పుకారు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. ఆమె వివాహానంత‌రం సినిమాల‌కు దూర‌మైన‌ త‌ర్వాత ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భం దాల్చింద‌ని ట్రెండింగ్ అవుతున్న వార్త‌.

ఈ వార్త ఆ నోట ఈ నోట పోయి చివ‌రికి ఆ భామ‌కు తెలియ‌డంతో వెంట‌నే ఖండించేసింది. తాను గ‌ర్భ‌వ‌తిని కాలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఆమెనే బిపాషాబ‌సు. ఈ భామ మోడలింగ్‌లో ఉన్నప్పుడే ఎంతో క్రేజ్ సంపాదించుకొని చివ‌రికి హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ప్ర‌వేశించింది. ఆమె హాట్ హాట్ అందాల‌కు పురుష లోకం పూన‌క‌మెత్తింది. సోషల్ మీడియా కూడా అప్పుడు ఎక్కువగా వాడకంలో లేదు.

బిపాషా అందాలు కుర్రకారు మతిపోగొడుతాయి. ఆమె పోస్టర్లు.. హాఫ్ న్యూడ్ ఫొటోలు కుర్రాళ్ల దుప్ప‌ట్లపై ఉంటాయి. హారర్, యాక్షన్, లవ్ ఇలా ఏ సినిమా చేసిన త‌న అందంతో ఆక‌ట్టుకునేది. 2015లో కెరీర్‌లో హై స్టేజీ ఉన్న‌ప్పుడే ప్రేమించి 2016లో న‌టుడు కరణ్ సింగ్ గ్రోవేర్‌ను పెళ్లాడింది. అప్ప‌టి నుంచి వివాహ జీవితం అనుభ‌విస్తూ సినిమాల‌కు దూర‌మైంది.

అయితే ఇటీవ‌ల ఆమె గ‌ర్భం దాల్చింద‌ని రూమర్స్ వ‌చ్చాయి. అయితే ఆమె సన్నిహితులు మాత్రం అందులో నిజం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం బిపాషా గోవాలో తన భర్తతో ఎంజాయ్ చేస్తోంది. అక్కడే హాట్ డ్రెస్సుల్లో ఫొటోలకు స్టిల్స్ ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -