Thursday, May 16, 2024
- Advertisement -

బిత్తిరి సత్తి కొత్త గెట‌ప్ చూశారా

- Advertisement -

పాట పాడిన బ‌త్తిరి స‌త్తి

తెలంగాణ యాస‌ల.. బిత్తిరి చేష్ట‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న బిత్తిరి స‌త్తి అలియాస్ ర‌వికుమార్‌ ఇప్పుడు న్యూ ఇయ‌ర్‌కు ఓ కొత్త ఫాట‌తో వ‌చ్చిండు. వీ6 చాన్న‌ల్ల తీన్మార్ ఆర్త‌ల‌తో ఫేమ‌సైన బిత్తిరి స‌త్తి ఈ న‌డిమ‌ధ్య‌న సినిమాల్లో కూడా క‌నిపిస్తున్నాడు. అత‌డికి ఎప్ప‌టి నుంచో సినిమాల్లో క‌నిపించాల‌ని ఉన్నాడు. అందుకే వీ6 ద్వారా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తుల‌ను క‌లుస్తూ త‌న‌కు ఓ అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుకుంటూ వ‌చ్చిండంట‌. ఆ విధంగా సినిమా వాళ్ల‌ను క‌లుస్తున్న స‌మ‌యంలో సినీ అవ‌కాశాల‌ను రానే వ‌చ్చాయి. ఎలాగో వీ6తో తెలుగు ప్ర‌జ‌ల్లో అభిమానం సంపాదించుకున్న న‌టుడ‌ని సినిమాకు చెందిన వారు అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు కొత్త అవ‌తారం ఎత్తాడు గాయ‌కుడిగా.

న్యూ ఇయ‌ర్‌కు వెల్కం చెబుతూ ఓ పాట అందుకున్నాడు. ఆ పాట వైర‌స్ అనే పాట పాడాడు. సోషల్ మీడియా వ్యసనాలపై ఈ పాట ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ పేరిట రజినీకాంత్ ఎర్రబెల్లి నిర్మించి, సురేందర్ మిట్టపల్లి లిరిక్స్ సమకూర్చిన ఒక పాట ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా ఉంది. సోషల్ మీడియాలో ఫేక్ అక్కౌంట్ల గురించి, ఆన్‌లైన్ మోసం చేస్తున్న వారి గురించి, మోసపోతున్న వారి గురించి ఒక సందేశాత్మకంగా ఈ పాట‌ రూపొందించారు. ఈ పాట యుట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -