Friday, May 3, 2024
- Advertisement -

వావ్‌..‘రంగీలా’.. మ‌ళ్లీ న‌చ్చేశావ్‌గా ఆర్జీవీకి

- Advertisement -

త‌న ద‌ర్శ‌క‌త్వంలో చేసిన హీరోయిన్‌. సినిమాల త‌ర్వాత పెళ్లి చేసుకొని కొన్నాళ్లు సినీ ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు రంగీలాగా వ‌స్తోంది. అయితే త‌న సినిమాలో న‌టించిన హీరోయిన్ మ‌ళ్లీ క‌నిపించ‌డంతో ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఫిదా అయిపోయాడు. వావ్ రంగీలా అంటూ తెగ పొడిగేశాడు.

అలనాటి నటి ఊర్మిళ మరోసారి సినిమాల్లో సందడి చేస్తోంది. అభినయ్‌ డియో దర్శకత్వంలో హీరోగా ఇర్ఫాన్‌ ఖాన్ న‌టిస్తున్న సినిమా ‘బ్లాక్ మెయిల్‌’. ఈ సినిమాలో ఊర్మిళ ‘బేవఫా బ్యూటీ’ అనే ఐటమ్‌ సాంగ్‌లో ఆడుతోంది. ఈ పాటను ఇటీవ‌ల విడుదల చేశారు. ఈ పాటలో ఊర్మిళ ఎప్పటిలాగే ఎంతో అందంగా.. క‌వ్విస్తూ క‌నిపిస్తోంది. ఈ వీడియోను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చూసి ఊర్మిళ‌పై పొగ‌డ్త‌లు కురిపించాడు. ఊర్మిళ రీ ఎంట్రీని ఆహ్వానించాడు.‘వావ్‌..‘రంగీలా’ భామ ఇప్పటికీ అంతే అందంగా ఉంది. ఫరెవర్‌ గ్రీన్‌ ఊర్మిళను ఈ పాటలో చూశారా’ అంటూ వీడియోను రామ్‌గోపాల్ వ‌ర్మ షేర్ చేశారు.

అయితే ఊర్మిళ ఆర్జీవీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ప‌లు సినిమాల్లో న‌టించింది. ‘అంతం’, ‘రంగీలా’, ‘గాయం’, ‘దౌడ్‌’ సినిమాల్లో ఊర్మిళ రామ్‌గోపాల్‌తో క‌లిసి ప‌ని చేసింది. వర్మ తీసిన చాలా సినిమాల్లో ఊర్మిళ హరోయిన్‌గా నటించింది. ఆ త‌ర్వాత సినిమాల‌కు దూర‌మై 2016లో కశ్మీర్‌కి చెందిన వ్యాపారవేత్త మోహ్సిన్‌ అఖ్తర్‌ మిర్‌ను ప్రేమ వివాహం చేసుకుని సినిమాల్లో క‌నిపించ‌లేదు. మ‌ళ్లీ ఇప్పుడు ‘బ్లాక్ మెయిల్‌’ సినిమాతో వ‌స్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -