Thursday, May 9, 2024
- Advertisement -

పాపం.. కల్యాణ్ రామ్

- Advertisement -

నందమూరి హీరో కల్యాణ్ రామ్ ను చూసి ఇప్పుడంతా పాపం అని జాలి పడుతున్నారు. పటాస్ తో అదృష్టం కలిసి వచ్చిందనుకుని సంబరపడితే… ఇప్పుడు వరుసగా కిక్ 2, షేర్ సినిమాలతో ఆ ఆనందం ఆవిరైపోయిందని కల్యాణ్ రామ్ తో పాటు.. నందమూరి ఫ్యాన్స్ కూడా బాధ పడుతున్నారట. ఎన్నో అంచనాలతో.. తన కెరీర్ కు మరో మైల్ స్టోన్ గా నిలుస్తుందన్న ఆశతో చేసిన ఈ సినిమా… చివరికి ప్రేక్షకులను మెప్పించకపోవడంతో.. తన తర్వాత సినిమాకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడయ్యాడట కల్యాణ్ రామ్.

షేర్ కు ముందు నిర్మాతగా కూడా కల్యాణ్ రామ్ ఫెయిల్యూర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. పటాస్ ఇచ్చిన ఉత్సాహంతో రవితేజ హీరోగా కిక్ 2 సినిమాను సొంత బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మించాడు. రేసు గుర్రం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా.. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భారీ ఖర్చుపెట్టి మరీ కిక్ సినిమా ప్రొడ్యూస్ చేశాడు. చివరికి రిజల్ట్ రివర్స్ అవడంతో నిర్మాతగా కోలుకోలేని నష్టాన్ని కల్యాణ్ రామ్ మూటగట్టుకున్నాడు. ఆఖరికి తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట సహాయంతో.. కిక్ 2 సినిమా థియేటర్లలోకి వెళ్లిందని వార్తలొచ్చాయి. ఇంత కష్టపడినా.. చివరికి సినిమా ఫెయిలవడం కల్యాణ్ రామ్ ను కష్టాల్లో నెట్టింది.

ఇలాంటి టైమ్ లో.. షేర్ తో టాలీవుడ్ లో గర్జిద్దామని ఆశపడిన నందమూరి హీరోకు.. మళ్లీ చుక్కెదురైంది. ఇంతకుముందు అభిమన్యు, కత్తి లాంటి ఘోరమైన సినిమాలు తీసిన డైరెక్టర్ మల్లికార్జున్ ను నమ్మి.. షేర్ అవకాశాన్ని అతనికే ఇచ్చిన కల్యాణ్ రామ్.. చివరికి తను కలలోనూ ఊహించని రిజల్ట్ అందుకున్నాడు. హీరోగా పటాస్ లాంటి హిట్ వచ్చాక.. ఆ స్వింగ్ ను కంటిన్యూ చేయాలంటే.. పక్కా ప్లాన్ ఎంతో అవసరం. కానీ.. అలాంటిదేదీ లేకుండా.. షేర్ సినిమాతో మల్లికార్జున్ తో హ్యాట్రిక్ ఫెయిల్యూర్ ను తన కెరీర్ కు యాడ్ చేశాడు… కల్యాణ్ రామ్.

నిన్న నిర్మాతగా.. ఇప్పుడు హీరోగా నష్టపోయిన కల్యాణ్ రామ్.. కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే మళ్లీ పటాస్ లాంటి భారీ హిట్ కొట్టాల్సిందే. తనే హీరోగా తన బ్యానర్ లోనే సినిమాలు చేసి మ్యాగ్జిమమ్ సక్సెస్ లు అందుకున్న ఈ నందమూరి హీరో… అదే సెంటిమెంట్ తో.. ఇప్పుడు తన కెరీర్ ను ట్రాక్ లో పెట్టేందుకు ట్రై చేస్తే రిజల్ట్ వచ్చే అవకాశం ఉందేమో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -