బ్రహ్మి భలే కొరికాడు!

నవ్వించడం నటులకి అంత తేలిక కాదు. నవ్వించగలిగిన నటులకి మిగిలిన అన్ని రసాలు అభినయించడం తేలికే!

అటువంటి హాస్యాన్ని పండించి మెప్పించిన హాస్య నటులు తెలుగులో ఎందరో!

వారంతా ప్రజల గుర్తింపునూ పోందారు. వారిలో కొందరు ప్రభుత్వ గుర్తింపునూ పొందారు!

అలాంటి వారిలో బ్రహ్మానందం ఒకరు.

ఈయన సినిమాలోనే కాదు, బయట కూడా ఏ సమయంలో నైనా కామెడీ పండించడంలో దిట్ట. తాజాగా అఖిల్‌ మూవీ థాయిలాండ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని బ్రహ్మీ ఇండియా వచ్చాడు. వచ్చే సమయంలో విమానంలో వెన్నెల కిషోర్‌తో సరదాగా గడిపాడు. ఆ సమయంలోనే సరదాగా వెన్నెల కిషోర్ తన వేలు బ్రహ్మి నోట్లో పెట్టగా, ఆయన బలంగా కొరికేశాడు. దాంతో కిషోర్ కెవ్వుమన్నాడు. ఈ ఫోటోను అక్కినేని ఫ్రిన్స్ క్లిక్‌ మనిపించి, ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.