Thursday, April 18, 2024
- Advertisement -

“బ్రహ్మ్జస్త్ర ” బాలీవుడ్ ను గట్టెక్కించేనా ?

- Advertisement -

ప్రస్తుతం బాలీవుడ్ ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజ్ అయిన.. అంతే స్పీడ్ లో తిప్పికొడుతున్నారు అక్కడి ఆడియన్స్. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమానైనా.. హిందీ ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా అక్కడ సౌత్ సినిమాల హవా పెరగడంతో బాలీవుడ్ హీరోలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు హిందీ ప్రేక్షకులు. దానికి తోడు బాయ్ కాట్ ట్రెండ్ కూడా ఇప్పుడు బాలీవుడ్ ను కుదిపేస్తోంది. బాయ్ కట్ దెబ్బకు ఇటీవల రిలీజ్ అయిన అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలు ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో రణ్ బీర్ కపూర్, అలియా భట్ నటించిన బిగ్ బడ్జెట్ మూవీ ” బ్రహ్మస్త్ర ” తాజాగా విడుదల అయింది. దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై బాలీవుడ్ సినివర్గం గట్టిగానే ఆశలు పెట్టుకుంది. అయితే సినిమాకు ప్రస్తుతం ప్రజల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందా ? చెప్పడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే సినిమా స్క్రీన్ ప్లే పరంగా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా బాగానే ఉన్నప్పటికి, కథ వీక్ గా ఉండడంతో సగటు ప్రేక్షకుడు పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ మూవీ డిజాస్టర్ అంటూ ట్విట్టర్ లో విపరీతంగా ట్రెండ్ నడుస్తోంది. అయితే అమీర్ ” లాల్ సింగ్ చడ్డా ” , అక్షయ్ కుమార్ ” రక్షా బంధన్ ” వంటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కలెక్షన్స్ కాస్త పర్వాలేదనిపించే విధంగా ఉన్నట్లు బాలీవుడ్ సినివర్గం చెప్పుకొస్తోంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా కష్టాల్లో ఉన్న బాలీవుడ్ ను గట్టెక్కిస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -