Saturday, April 20, 2024
- Advertisement -

రాహుల్ vs మోడీ.. బట్టల్లో ఎవరు తోపు ?

- Advertisement -

రాజకీయ నాయకులు మాట్లాడే మాటల్లో ప్రత్యేకత ఉంటుందో లేదో తెలియదు గాని, వస్త్రధారణలో మాత్రం ప్రత్యేకత చూపిస్తూ ఉంటారు.. దివంగత నేత స్వర్గీయ ఎన్ టీ రామారావు కాషాయ బట్టలు, చంద్రబాబు నాయుడు గోల్డెన్ షెడ్ ఖద్దర్, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలైన పొందూరు ఖద్దర్ పంచే కట్టు, ఇలా చాలా మంది నేతలు వారు వేసుకునే బట్టల విషయంలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. కానీ వారు వేసుకునే బట్టల ఖరీదు మాత్రం ఎప్పుడు ప్రస్తావనకు రాలేదనే చెప్పాలి.

కానీ ప్రస్తుతం మనదేశ ప్రధాని నరేంద్ర మోడీ వేసుకునే బట్టల ఖరీదు మాత్రం.. తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఆయన వేసుకునే డ్రస్సులలో చూపించే వైవిధ్యం. బహుశా మనదేశంలోని గత ప్రధానమంత్రులు ఎవరు కూడా నరేంద్ర మోడీకి డ్రస్ కోడ్ విషయంలో పోటీకి రారనే చెప్పాలి. మోడీ వేసుకునే సూట్, కుర్తాస్ వంటి డ్రస్సుల ఖరీదు లక్షల్లోనే ఉంటుంది. దీంతో చాలా సార్లు ఆయన వేసుకునే డ్రస్ పై ప్రతిపక్ష పార్టీలు ఎన్నో విమర్శలు కూడా చేస్తూ వస్తున్నాయి. ఇక తాజాగా మరోసారి నరేంద్ర మోడీ డ్రస్ ఖరీదు ప్రస్తావనకు వచ్చింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ పూర్వ వైభవం కోసం ” భారత్ జోడో యాత్ర ” ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ యాత్రలో రాహుల్ వేసుకున్న టీ షార్ట్ ఖరీదు అక్షరాల 41 వేలు ఉండడంతో.. బీజేపీ వ్యంగ్యస్త్రాలు సంధించింది. ” భారత్ ధేఖో.. అంటూ రాహుల్ వేసుకున్న టీ షార్ట్ ఖరీదు ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది బీజేపీ. దీనికి వెంటనే కాంగ్రెస్ కౌంటర్ ఇస్తూ ” జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి భయపడుతున్నారా ? దేశంలో ఉన్న సమస్యలపై, నిరుద్యోగంపై మాట్లాడండి. దుస్తుల ధరలపై చర్చించాల్సి వస్తే, మోడీ ధరించిన 10 లక్షల సూట్, 1.5 లక్షల కళ్ళజోడు గురించి చర్చిద్దాం ” అంటూ కాంగ్రెస్ కౌంటర్ వేసింది. దీంతో బట్టల ఖరీదు పై ఉండే శ్రద్ద దేశ సమస్యలపై పెట్టండి అంటూ నెటిజన్స్ ఇరు పార్టీలను ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు.

Also Read

జాతీయ పార్టీకి రంగం సిద్దం.. ప్రకటనే తరువాయి ?

“జగన్ కోచింగ్” అంటే అదే మరి !

చంద్రబాబు మనసులో ఏముంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -