Saturday, May 4, 2024
- Advertisement -

అటకెక్కిన బాలకృష్ణ సినిమా…!

- Advertisement -

ఈ మధ్యనే ‘ఎన్టీఆర్ బయోపిక్’ తో రెండు వరుస డిజాస్టర్లను అందుకున్న నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమా గురించి బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. బాలకృష్ణ ‘జై సింహ’ ఫేమ్ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు అని వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను స్క్రిప్ట్ లో కొన్ని ప్రాబ్లెమ్స్ వలన ఆపువేసినట్లు తెలుస్తోంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.

ఈ సినిమా పూర్తయ్యాక బాలయ్య బోయపాటి శ్రీను లేదా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. నిజానికి వి.వి.వినాయక్ దర్శకత్వంలో బాలయ్య గతేడాది ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ వినాయక చెప్పిన కథ బాలయ్య కు నచ్చలేదు. అదే సమయంలో కె.ఎస్.రవికుమార్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసారు బాలయ్య. కానీ తాజాగా ఫైనల్ డ్రాఫ్ట్ లో బాలకృష్ణకు కొన్ని సందేహాలు తలెత్తాయి. అందుకని ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి బాలకృష్ణ తదుపరి సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఎవరికి దక్కుతుందో ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -