Friday, March 29, 2024
- Advertisement -

రకుల్ సినిమా ని తెలుగులో రీమేక్ చేస్తున్నారట..

- Advertisement -

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలంగా తమిళం మరియు హిందీ భాషలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే రకుల్ ప్రీత్ హిందీలో ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాతో హిట్ అందుకుంది. 90 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి హిట్ గా నిలిచింది. ఇందులో హీరోగా నటించిన అజయ్ దేవగన్ 50 ఏళ్ళు ఉన్న విడాకులు తీసుకున్న పిల్లల తండ్రి పాత్రలో కనిపించగా 25 ఏళ్ల అమ్మాయి గా కనిపించింది రకుల్. వారిద్దరి మధ్య ప్రేమ కథే ఈ సినిమా.

ఎంటర్టైన్మెంట్ కు పెద్దపీట వేసి తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి హిట్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వెంకటేష్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని, వెంకీ కి స్క్రిప్ట్ కూడా బాగా నచ్చేసింది అని తెలుస్తోంది. ఇప్పటికే సురేష్ బాబు చిత్ర రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ నిర్మాతలను సంప్రదించినట్టు సమాచారం. అసలే వెంకీ సినిమా కాబట్టి ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా మరింత యాడ్ చేయనున్నారు అని మనం అనుకోవచ్చు. మరి ఈ సినిమాలో కూడా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుందా లేదా ఇంకా తెలియాల్సి ఉంది. హిందీ సినిమాలో టబు ముఖ్య పాత్ర పోషించింది. ఇక తెలుగు రీమేక్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -