Wednesday, May 15, 2024
- Advertisement -

మేం చేసింది పెద్ద త‌ప్పే క్ష‌మించండి – బ్రిటీష్ ఎయిర్‌వేస్‌

- Advertisement -

హీరో మంచు విష్ణుకి బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమాన సంస్థ క్ష‌మాపణ చెప్పడం చ‌ర్చ‌నీయాశంగా మారింది.పూర్తి వవ‌రాల్లోకి వెళ్తే…మంచు విష్ణు ఇటీవల లండన్ నుంచి వెనిస్‌కు వెళ్లారు.కానీ ఆయన లగేజీ మాత్రం లండన్‌లోనే ఉండిపోయింది. ఆయన బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో లండన్ నుంచి వెనిస్‌కు ప్రయాణించారు. అయితే ఎయిర్ వేస్ సిబ్బంది ఆయన లగేజిని లండన్‌లోనే వదిలేసింది.దీనిపై మంచు విష్ణు ఎయిర్‌వేస్‌పై వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేశారు.

‘‘వెనిస్‌లో దిగాను.. లండన్‌ నుంచి ఇక్కడికి వచ్చాను. నా లగేజీని లండన్‌లోనే వదిలేసినందుకు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కు ధన్యవాదాలు. లవ్‌ యు టూ’’ అంటూ ట్వీట్ చేశాడు విష్ణు.ఈ సంఘ‌ట‌న‌పై స్పందించిన బ్రిటీష్ ఎయిర్‌వేస్ మంచు విష్ణుకి క్ష‌మాప‌ణ కోరింది.ఇలాంటి తప్పులు అప్పుడప్పుడు జరుగుతుంటాయని.. వీలైనంత త్వరగా తమ బృందం ద్వారా మీ చిరునామాకే లగేజీని పంపిస్తామని విష్ణుకు స్పష్టం చేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -