Sunday, May 19, 2024
- Advertisement -

బ్రూస్ లీకి వెళ్తే….దూకుడు 2 చూపించారు

- Advertisement -

ఎన్నో అంచనాల నడుమ రిలీజైన  బ్రూస్ లీ మూవీ…. ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.  భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ చిత్రం ఎక్కడా ఆ ఎక్స్‌ఫెక్టేష‌న్స్‌ను రీచ్ కాలేక‌పోయింద‌ని ట్రేడ్ వ‌ర్గాల విశ్లేషిస్తున్నారు.శ్రీనువైట్ల మూవీ అంటేనే ఎంతో కొంత బాగానే ఉంటుంది అని చెప్పొచు. కానీ ఈ బ్రూస్‌లీ అందరి అంచనాలు తారుమారు చేసిందనే టాక్ బయట నడుస్తోంది. 

నిజానికి బ్రూస్ లీ రావడం రావడమే పంచ్ లతో వచ్చి మీద పడిపోయాడు .బెనిఫిట్ షోతోనే సీన్ మొత్తం సితార్ చేసేశాడు.ఎన్నో ఆశలతో వెళ్లిన అభిమానులకు చిరు కనిపించాడు అనే ఆనందం తప్ప…. అంతకు మించి మరేమి కనిపించలేదు.దీంతో బ్రూస్ లీ ప్రేక్షకులను నిరుత్సాహ పరిచినట్లుగా టాక్ మొదలైపోయింది.బెనిఫిట్ షో అంటే కామెంట్స్ చేయడం కోసమే వెళ్లేవారుంటారనుకుని సరి పెట్టుకుంటే ఓకే.మరి  మార్నింగ్ షో తో వచ్చే సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చడంతో సినిమాపై రివ్యూవర్స్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు.

సినిమా ఫస్టాఫ్ వరకూ ఏదో మమ అనిపించేశాడు.సెకండాఫ్ లో అయినా శ్రీనువైట్ల జోనర్ ను హ్యాపీగా చూద్దామనుకుంటే అలాంటిదేమి లేకుండానే పోయింది.దూకుడు చూపించాడు.బాద్ షాను మైమరపించాడు.అంతటితో ఆగాడంటే అదీ లేదు.రెఢీ అంటూ ఎక్కడికో వెళ్లిపోయి ఆగడు వరకూ చూపించింది చూపించనట్లుగా , చెప్పింది చెప్పనట్లు అటు ఇటు తిప్పి మరీ చూపించేశాడు. మొత్తమ్మీద‌, బ్రూస్‌లీకి నెగిటివ్ టాక్ న‌డుస్తోంది.  ఫ‌స్ట్ హాఫ్ మొత్తం కామెడీ ప్లస్ యాక్షన్ ఎంట‌ర్‌ట‌యినర్‌గా పర్వాలేదు.  సెకండాఫ్‌లో మాత్రం శ్రీనువైట్ల అందరికి చుక్కలు చూపించాడు అనే టాక్ బయట స్ప్రెడ్ అయిపోయింది.

సెకండాఫ్‌లో చిరు ఎంట్రీ మాత్రం అదిరింది అన్న ఒక్క మాట మాత్రమే యూనిట్ కు ఆనందానిస్తోంది.చిరు గుర్రంపై వ‌చ్చే సీన్‌కి థియేట‌ర్స్ లో ఆడియన్స్ వేసిన ఈలలకు పై కప్పులు లేచిపోయాయి. సెకండాఫ్‌లో సినిమాకి ఇది ఒక్కటే ఎస్సెట్‌. అది కూడా మెగా ఫ్యాన్స్‌ని కిక్ ఎక్కించే విధంగానే ఉంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -