Saturday, May 18, 2024
- Advertisement -

బొమ్మ పడింది

- Advertisement -

ఎలాగైతేనేం….. మెగా అభిమానులు కూల్ అయిపోయారు.షో పడే వరకు మాంచి పోటు మీదున్న మనోళ్లు….. షో పడ్డాక సినిమా  చూసేశాం అన్న ఫీలింగ్ తో థియేటర్ నుంచి బయటకు వెళ్లారు.

ఐటి దాడులు జరుగుతున్నాయి కదా అని చెప్పి….. పులి మాదిరిగా బెనిఫిట్ షో క్యాన్సిల్ అయిపోతుందనుకున్నారు గాని…అలాంటిదేం జరగనే లేదు. మొత్తానికి అనుకున్న టైమ్ కు చెప్పిందిచెప్పినట్లుగా బొమ్మ పడిపోయింది.

చెప్పింది చెప్పినట్లు చేయడంలో మెగా కాంపౌండ్ ఎప్పుడూ ముందుటుంది. సినిమా ముహూర్తం రోజు ఏ రోజు రిలీజ్ అని చెప్పారో… అదే రోజు సినిమా విడుదలైపోయింది.

మెగా ప్రేక్షకులే కాదు…మిగతా హీరోల అభిమానులు కూడా చెర్రీ కోసమని కాకుండా…చిరంజీవి కోసం థియేటర్ కు పరిగెత్తారు.అన్నయ్యను ఎప్పుడెపుడు చూద్దామా అని ఆశించిన జనాలకు చిరు ఇచ్చిన మెగా ట్రీట్ అదిరిపోయిందని చెప్పాలి. అయితే సినిమా బ్రూస్ లీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ను చూసి…. దాదాపుగా 2000 వేలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. మన రెండు తెలుగురాష్ట్రాల్లోనే 1500 స్క్రీన్ల పై బొమ్మ పడిందంటేనే  అర్థం చేసుకోవాలి. రీ ఎంట్రీ ఇస్తోన్న చిరంజీవికి దిష్టి తగలకుండా ఫ్యాన్స్ ఆయన  కటౌట్ కు 500 కేజీల గజమాలతో  సత్కరించేశారు.

సెకండాఫ్ లో చిరు హెలికాఫ్టర్ లాంచింగ్ ..వెంటనే ఫైట్స్ ,రకుల్ సోపేయడం లాంటివి …ఆధ్యంతం మెగా అభిమానులనే కాదు..చూస్తోన్న ప్రేక్షకులను మైమరపించాయి.చిరును చూసిన జనాలు థియేటర్లో ఊగిపోయారు.

చిరు ఏజ్ ను కవర్ చేస్తూ…ఆయన తీసుకున్న కేరళ వైద్యం ప్రేక్షకుల ముందుకు వచ్చే సరికి భలే వర్కవుట్ అయింది.ఇక గుర్ర మెక్కిన తండ్రి కొడుకులను చూస్తే…ఔరా అనిపించక మానదు. ఈ ఊపులోనే పైరసీలు కూడా జరిగిపోయాయి.ప్రస్తుతం సైబర్ సెల్ ఈసినిమాను పైరసీ కాకుండా కాపాడే పనికి పూనుకుంది. ఆల్రెడీ నెట్లో ఈసినిమాకు సంబందించిన కొన్ని సీన్స్ పైరసీ అయిపోయి వాట్సాప్స్ లో షేర్ అయిపోతూ ఉన్నాయి.

ఈ సినిమాలో మొదటి హాప్ లో వచ్చిన  టైమింగ్ కామెడీ చూస్తే…కోన వెంకట్ మార్క్ కనిపించక మానదు. శ్రీనువైట్ల  నుంచి ప్రేకక్షకుల ఏం కోరుకుంటారో అదే చూపించాడు..రకుల్ అందాల ఆరబోత కాస్త శృతి మించినప్పటికీ…వేడిగా ఉన్న మెగా అభిమానులకు ఇది మంచి ఊరట అనిపించక మానదు.ఇక లుంగీ డ్యాన్స్ లో చెర్రీబాబు చేసిన డ్యాన్స్ చూడతరమే అనాలి.ఇలాంటి సినిమాకు ఓన్లీ మల్టిఫ్లెక్స్ ఆడియన్స్ మాత్రమే కాదు

బి,సి సెంటర్స్ లోను అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి.ఏది ఏమైనా బ్రూస్ లీ ఆగమనం మెగా అభిమానుల వరకు కొండంత బలానిచ్చినట్లయింది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వరకూ సినిమాకు మాంచి రికార్డ్ నమోదయ్యే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -