Monday, April 29, 2024
- Advertisement -

కన్నడ లో పాగా వేయనున్న కాలకేయ

- Advertisement -

మర్యాద రామన్న అనే సినిమా తో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ ఆ తరువాత చాలా సినిమాల లో విలన్ పాత్ర పోషించినా అనుకున్నంత విజయం సాదించలేకపోయాడు. కానీ రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన బాహుబలి చిత్రం లో అతను వేసిన కాలకేయ పాత్ర అందర్నీ ఎంతగానో మెప్పించింది. ఆ పాత్ర ద్వారా ప్రభాకర్ కి ఎనలేని గుర్తింపు వచ్చింది. మళ్లీ ఆ తరువాత అడపదడపా చిత్రాలు తీసినప్పటికి అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేక పోయాడు.

ఇప్పుడు చాలా కాలం తరువాత త్వరలో రానున్న కన్నడ చిత్రం బిచ్చుగతి లో ప్రభాకర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల లో వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ కేవలం తనకు గుర్తింపు తెచ్చే పాత్రల కోసం మాత్రమే చూస్తున్నాడు. అలా వెయిట్ చేసిన ప్రభాకర్ కి ఈ బిచ్చుగతి లోని పాత్ర చాలా కీలకమైనది అని తెలుస్తుంది.

రాజావర్ధన్ ముఖ్య పాత్ర లో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రానికి హరి సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం యొక్క షూటింగ్ త్వరలో పూర్తి కానున్నది. ఈ సినిమాలో ప్రభాకర్ పోషిస్తున్న పాత్ర అందర్నీ మెప్పించేలా ఉండబోతోంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా యొక్క మరిన్ని వివరాల త్వరలో రానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -