Tuesday, April 16, 2024
- Advertisement -

సైరాలో అప‌శృతి… విదేశీ ఆర్టిస్టు మృతి

- Advertisement -

చిరంజీవి హీరోగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘సైరా’ సినిమాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించిన సెట్లు కాలిపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో సంఘ‌ట‌న చోటు చేసుకుంది. సినిమాలో న‌టిస్తున్న రష్యాకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ మృతిచెందాడు.

టూరిస్ట్ వీసాపై మార్చిలో హైదరాబాద్ కు వచ్చి, సైరాలో ఓ పాత్రను పోషిస్తున్న అలెగ్జాండర్ (38) అనే వ్యక్తి గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ గేట్‌ నెంబర్‌–1 వద్ద అపస్మారక స్థితిలో కనిపించాడు. ఎండ వేడిమిని తాళలేక ఆయన పడిపోగా, పోలీసులు తొలుత కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి త‌ర‌లించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి త‌ర‌లించ‌గా చికిత్స పోందుతూ మృతి చెందారు.

మృతుడికి చెందిన కెమెరాలో ఫొటోల ఆధారంగా ‘సైరా’ సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా నటించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 4, 5 తేదీల్లో ‘సైరా’ సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా నటించాడని పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి సమీపంలోని ఓ హోటల్‌లో నివాసం ఉన్నాడు.మే 10వ తేదీన హోటల్ ఖాళీ చేసిన తర్వాత రోడ్లపైనే తిరిగాడని తెలుస్తోంది. గోవాలో ఉండే అతని స్నేహితుడు బోరెజ్‌కు సమాచారం అందించామని, అతను వచ్చిన తర్వాతే పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -