Monday, April 29, 2024
- Advertisement -

క్లోజ్ ఫ్రెండ్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన బన్నీ..!

- Advertisement -

దర్శకుడు పూరి జగన్నాథ్ కి 14లక్షల ఖరీదైన సిగరెట్ లైటర్ గిఫ్ట్ గా ఇచ్చి అప్పట్లో నిర్మాత నటుడు బండ్ల గణేశ్ హాట్ టాపిక్ అయ్యాడు. ఆ లైటర్ ని 1455 డైమండ్స్ తో డిజైన్ చేశారు. సో ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఇండస్ట్రీలో మాములే. పలువురు నిర్మాతలు, హీరోలు కూడా తమ దర్శకులకు కార్లను గిఫ్ట్ గా ఇవ్వడం చూశాం.

కోట్లల్లో మార్కెట్ నడిచే ఇండస్ట్రీలో లక్షల్లో ఉండే గిఫ్ట్ లు ఇవ్వడం పెద్ద విషయమేమి కాదు. కానీ నిజమైన ప్రేమ ఆప్యాయతతో ఆ కానుకలు ఇచ్చినప్పుడు ఉండే కిక్కు వేరు. తాజాగా యువ నిర్మాత బన్నీ వాస్ కి స్టార్ హీరో అల్లు అర్జున్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి హాట్ టాపిక్ గా మారాడు. ఎంతో విలువైన డైమండ్స్ తో తయారు చేసిన శాంటోస్ -డి కార్టియర్ వాచ్ ని కానుకగా ఇచ్చాడు. ఈ వాచ్ ఖరీదు మన కరెన్సీ లో 25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బన్నీ వాసు అల్లు అర్జున్ కి క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే.

అయితే ఈ గిఫ్ట్ ఎందుకు ఇచ్చాడంటే.. అల వైకుంఠపురములో చిత్రంతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న ఆనందంలోనే తన ఫ్రెండుకి గిఫ్ట్ ఇచ్చాడట. ఇక ఈ సినిమా సక్సెస్ లో బన్నీ వాస్ పాత్ర కూడా ఉంది. స్క్రిప్ట్ సహా ప్రతిదాంట్లో ఈ యువ నిర్మాత ఇన్వాల్వ్ మెంట్ ఉంది. గీతా ఆర్ట్స్ సంస్థకు బన్ని వాస్ నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుంది. పరిమిత బడ్జెట్లలో మంచి హిట్స్ అందుకున్న నిర్మాతగా బన్ని వాస్ కి మంచి పేరు ఉంది. అందుకే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో స్క్రిఫ్టు సహా చాలా విషయాల్లో బన్ని వాసు సలహాలు తీసుకుంటాడు. సక్సెస్ అందుకున్న ప్రతిసారి అల్లు అర్జున్ ఇలా కానుకలు ఇస్తూ ఉంటాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -