Wednesday, May 15, 2024
- Advertisement -

విలన్ తరుణ్ అరోరా భార్య ఎవరో తెలుసా ?

- Advertisement -

అంజల జావేరి నిన్నటి తరం సినీ ప్రేక్షకులకి బాగా తెలిసిన నటి. 90 లో అందరు తెలుగు టాప్ హీరోలతో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి టాప్ హీరోలందరితో కలిసి నటించింది. వెంకటేష్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయిన ప్రేమించుకుందాంరా సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది అంజల జావేరి.

తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. ఇప్పటివరకు 23 చిత్రాల్లో నటించింది అంజల జావేరి. ఆఖరిగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించి మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. అంజలి పెళ్లి చేసుకుంది కూడా ఒక నటుడినే. అతను ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో విలన్ చేస్తున్నాడు. అతని పేరు తరుణ్ అరోరా.

ఇతను చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కాటమరాయుడు, జయ జానకి నాయక చిత్రాల్లో మంచి మంచి పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అంజల జావేరి పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు కానీ తరుణ్ మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీ ఫోటోస్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -