Monday, April 29, 2024
- Advertisement -

విక్రమ్ పైనే ఆశలు పెట్టుకున్న బయ్యర్లు

- Advertisement -

గత కొంతకాలంగా విక్రమ్ కెరీర్ లో పెద్ద హిట్ సినిమాలు లేవు. ఒకవైపు తమిళంలో మాత్రమే కాక ఇటు తెలుగులో కూడా విక్రమ్ కు ఏమంత మార్పులు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘కదరం కొండన్’ అనే సినిమా పై కూడా ఏ మాత్రం మంచి అంచనాలు నెలకొనడం లేదు. ఒకవైపు ట్రేడ్ వర్గాలు మరోవైపు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు ఈ సినిమా తమిళంలోనే కాక ‘మిస్టర్ కేకే’ అనే టైటిల్ తో తెలుగు లో కూడా విడుదల కాబోతోంది.

‘తుంగావనమ్’ ఫేమ్ రాజేష్ ఎం సెల్వ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రం ఈ సినిమాలో ఒక మలేషియన్ అండర్వరల్డ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఏమాత్రం బజ్ లేకపోవడం వల్ల ఎవరైనా తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తారా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం విక్రమ్ పెర్ఫార్మెన్స్ మీద నమ్మకంతో సినిమా ని కొనడానికి బయర్లు ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తోంది. మరి ఈ సినిమాతో అక్షర కి మంచి డెబ్యూ లభిస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -