Monday, April 29, 2024
- Advertisement -

నిర్మాత‌ల‌ను కుక్క‌ల‌తో పోల్చిన స్టార్ కెమెరామెన్

- Advertisement -

కెమెరామెన్ సంతోష్ శివన్ అటు తమిళ ఇండ‌స్ట్రీతోపాటు ఇటు తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా మంచి పేరుంది.కెమెరామెన్‌గా మంచి పేరు సంపాదించారు సంతోష్ శివ‌న్‌.డ‌బ్బులు కోసం సినిమాలు కాకుండా ,క‌థ న‌చ్చితేనే సినిమా చేస్తాడు సంతోష్ శివన్.అలాంటి సంతోష్ శివ‌న్ ఒక్క ట్వీట్‌తో తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు.నిర్మాతలు సాంకేతిక నిపుణులకు డబ్బులు ఇచ్చేప్పుడు నిర్మాతలు మొహం చిరాకుగా, హీరోయిన్ కి ఇచ్చేప్పుడు మాత్రం నవ్వుతూ ఇస్తారంటూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.నిర్మాత‌ల‌ను కించ‌ప‌ర్చ‌డంపై త‌మిళ నిర్మాతలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స‌ర‌దాగా చేసిన ట్వీట్ అని సంతోష్ శివ‌న్ చెప్పినప్ప‌టికి కొందరు నిర్మాతలు తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు.నిర్మాతల మండలి సమావేశమై దీని గురించి చర్చించనుంది. విషయం సీరియస్ అవుతుందని గ్రహించిన సంతోష్ శివన్ ఈ ట్వీట్ ని తన అకౌంట్ నుండి తొలగించారు. కాని అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.ఇక స్టార్ కెమెరామెన్ అయి ఉండి ఇలా చేయ‌డంపై సంతోష్ శివ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -