Wednesday, May 15, 2024
- Advertisement -

ఏపీ భాజాపా అధ్య‌క్ష ప‌ద‌వికి కంభంపాటి హ‌రిబాబు రాజీనామా

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఆయన పదవికి రాజీనామా చేయించేశారు. రాజీనామా లేఖ‌ను పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు కంభంపాటి లేఖను పంపారు.

టీడీపీ- బీజేపీ బంధం తెగిన తర్వాత…. తెలుగు దేశం పార్టీ బీజేపీ పైనా, మోడీపైనా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. మోడీని ఏకంగా చంద్రబాబు బ్రిటిష్‌ వారితో పోల్చారు. అయినా సరే ఏపీ బీజేపీ నుంచి అనుకున్న స్థాయిలో ఎదురుదాడి లేదు. సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు త‌దిత‌ర నేత‌లు బాబును టార్గెట్ చేయ‌డం తెలిసిందే.

మరో వారం రోజుల్లో ఏపీకి కొత్త అధ్యక్షుడి నియామయం ఉంటుందని తెలిసింది. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఆ పదవి అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. చిరకాల మిత్రుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి వైదొలగడం, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏపీలో పార్టీ అధ్యక్షుడి మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. సోము వీర్రాజు, కన్నా లక్ష్మిణారాయణల పేర్లను కూడా పరిశీలించిన అధిష్టానం చివరికి పైడికొండల వైపే మొగ్గిందని, ఈ నిర్ణయంలో బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి రాంమాధవ​ కీలక పాత్ర పోషించారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -