Saturday, May 4, 2024
- Advertisement -

వడ్డే నవీన్ కొడుకు పంచకట్టు వేడుకలో సినీ తారల సందడి..!

- Advertisement -

’పెళ్లి’, ‘మనసిచ్చి చూడు’, ‘చాలా బాగుంది’, ‘నా హృదయంలో నిదురించే చెలి’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో వడ్డే నవీన్. సెకండ్ ఇన్నింగ్స్ లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘అటాక్’ సినిమాలో కనిపించాడు.

ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు. తాజాగా నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరై జిష్ణుకు శుభాశీస్సులు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖా, కళాబంధు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత, నటులు మురళీమోహన్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సునీల్, వేణు తొట్టెంపూడి, శ్రీకాంత్ ఆయన సతీమణి ఊహా, రోజా, శివాజీ రాజా, నిర్మాత సి.కళ్యాణ్, రాశి, హేమ, శివ బాలాజీ ఆయన సతీమణి మధులత తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ వేడుకకు సంబంధిచిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వడ్డే నవీన్ ను చూసినవారు.. సర్ మీరు మళ్లీ సినిమాల్లో నటించాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -