Thursday, May 16, 2024
- Advertisement -

నిఖిల్, పల్లవిల ఎంగెజ్మెంట్.. ఎక్కడ జరిగిందంటే ?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నిఖిల్. హ్యాపీడేస్ సినిమాతో పరిచయమైన ఈయన ఆ తర్వాత చాలా సినిమాలు చేసాడు. స్వామి రారా నుంచి ఈయన కెరీర్ మరో టర్న్ తీసుకుంది. వరస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో ఇప్పుడు మరో కొత్త అడుగు వేస్తున్నాడు.

అర్జున్ సురవరం సినిమాతో హిట్ కొట్టిన నిఖిల్.. ఇప్పుడు జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌కు తెర తీస్తున్నాడు. త్వరలోనే ఈయన పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ యంగ్ హీరో నిఖిల్ రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఐదు సంవత్సరాలుగా నిఖిల్ పల్లవి వర్మ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నారు. భీమవరానికి చెందిన పల్లవి వర్మ డాక్టర్ గా పనిచేస్తోంది. తమ ప్రేమను పెద్దలకు చెప్పి వారి అంగీకారంతో ఫిబ్రవరి ఫస్ట్ గోవాలో కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే నిఖిల్, పల్లవి వర్మల ఎంగేజ్మెంట్ జరిగింది.

ఇప్పుడు రీసెంట్గా ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటికి వచ్చాయి. ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి ఏప్రిల్ 16న హైదరాబాద్లో ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. నిఖిల్, పల్లవిల జంట చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ ఫోటో చూసిన వారంతా కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -