Saturday, May 4, 2024
- Advertisement -

నారారోహిత్ కు చంద్రబాబు ఆ సలహా ఇచ్చాడట..!

- Advertisement -

నారా రోహిత్ .. నటుడిగా మంచి మార్కులు పొందాడు. ‘సోలో’ వంటి సినిమాతో పర్వాలేదనిపించుకొన్నాడు. అయితే నారా వారబ్బాయి హీరోగా నిలదొక్కుకోవాలంటే.. ఒక కమర్షియల్ హిట్ అవసరం. అయితే అది అంత సులభంగా దక్కడం లేదు. దీంతో అతడు తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు.

ఇలాంటి నేపథ్యంలో ‘అసుర’ సినిమాతో పలకరించబోతున్నాడు నారా రోహిత్. తనే నిర్మాతగా మారి ఈ సినిమాను రూపొందించిన ఈ హీరో.. ఈ సందర్భంగా పెదనాన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడాడు. బాబు తన సినిమా ప్రయాణానికి వెల్ విషర్ అని రోహిత్ చెప్పాడు.దాదాపుగా ఆయన తన ప్రతి సినిమానూ చూస్తాడని.. అయితే ఏడాది నుంచి ఫుల్ బిజీ అయిన ఆయన గత రెండు సినిమాలనూ మాత్రం చూడలేదని రోహిత్ వివరించాడు.

మరి సినిమాలకు సంబంధంచి బాబు మీకు ఏం సలహాలిస్తాడు.. అంటే “కుటుంబ కథ చిత్రాలు చేయాలి..” అంటూ రోహిత్ కు బాబు సూచించారట. ఈ మేరకు తను కూడా త్వరలో అలాంటి  సినిమాలతో రానున్నట్టుగా ఈ హీరో వివరించాడు. మొత్తానికి పెదనాన్న సూచనలకు రోహిత్ విలువ ఇస్తున్నాడనమాట! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -