Tuesday, April 30, 2024
- Advertisement -

జూన్ 27న మహేశ్ బాబు ఫ్యాన్స్ కు పసందు..!

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘శ్రీమంతుడు’ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే అభిమానులకు ఫుల్ కిక్కునిచ్చింది. ఈ టీజర్ లో మహేశ్ లుక్ అభిమానులను అమితంగా ఆకట్టుకొంటోంది.

టీజర్ ను బట్టే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అంచనాకు వచ్చేయొచ్చు అంటూ.. ప్రిన్స్ ఫ్యాన్స్ ఉల్లాసంగా ఉన్నారు. సినిమా సూపర్ హిట్ అంటూ వారు ఉత్సాహంగా చెబుతున్నారు.

మరి అభిమానుల్లో ఈ ఊపును కొనసాగిస్తూ ఈ నెల 27 వ తేదీ ఫ్యాన్స్ కు పసందైన విందును ఇవ్వనున్నాడు ప్రిన్స్. ఆ రోజున ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఆడియోవిడుదల అంగరంగ వైభవంగా జరగనుంది. మరి ప్రిన్స్ ఫ్యాన్స్ కు అంతకన్నా ఆనందకరమైన అంశం మరోటి ఉండదని చెప్పాలి.                               

ఈ సినిమా విడుదల తేదీ కూడా ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. జూలై 17 వతేదీన  ఈ సినిమా విడుదల కానున్నదని సమాచారం. ఆడియో విడుదల అయిన 20 రోజులకే సినిమా కూడా విడుదల కానుండటంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మహేశ్ గత సినిమా “ఆగడు” అభిమానులను కాస్తంత నిరాశపరించింది. మరి ‘శ్రీమంతుడు’ ఆలోటును భర్తీ చేస్తూ.. ఫుల్ వినోదాన్ని ఇస్తాడని వారు ఆశిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ఉన్నారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -