Friday, April 19, 2024
- Advertisement -

‘యాత్ర’పై చంద్రబాబు ఇంటెలిజెన్స్‌ని వాడేశాడా….. వాట్ నెక్ట్స్?

- Advertisement -

చంద్రబాబునాయుడి వ్యూహాల గురించి కొత్తగా చెప్పేదేముంది. అజ్ఙాతవాసి రిలీజ్‌కి ముందు నుంచీ పవన్ కళ్యాణ్‌పై మహేష్ కత్తిని వాడేశాడు. అదేంటంటే వైకాపా జనాలే పవన్‌పైకి మహేష్ కత్తిని ప్రయోగిస్తున్నారని బుకాయించారు. అదే నిజమైతే మహేష్ కత్తి కనుక జగన్ మనిషే అయితే ఫక్తు టిడిపి మీడియా అయిన మహాటీవీ, టీవీ9, ఆంధ్రజ్యోతిలు మహేష్‌కత్తిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి? సాక్షి ఎందుకు సైలెంట్‌గా ఉంది అంటే సమాధానం లేదు. రీసెంట్‌గా అశోక్ బాబుతో కలిసి టిడిపి కోసం మహేష్ కత్తి కర్ణాటక వెళ్ళడంతో మొత్తం జనాలకు పూర్తి స్పష్టత వచ్చింది. అలా ఉంటాయి చంద్రబాబు వ్యూహాలు.

ఇప్పుడు కూడా చంద్రబాబు వైఎస్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమా విషయంలో ఇంటెలిజెన్స్ వాడేశారు. యాత్రం సినిమాలో చంద్రబాబును విలన్‌గా చూపించబోతున్నారా? బాబుకు వ్యతిరేకంగా సినిమాలో ఏం ఉండబోతున్నాయి? లాంటి అంశాలపై ఎంక్వైరీ చేశారని తెలుస్తోంది. అలాగే వైఎస్ జగన్‌కి 2019 ఎన్నికలకు హెల్ప్ అయ్యేలా ఏమైనా కథ, కథనాలు ఉన్నాయా అని కూడా ఎంక్వైరీ చేశారట. అన్నింటికీ మించి యాత్రలో వైఎస్ జగన్ పెట్టుబడులు ఉన్నట్టుగా నిరూపించడానికి ఏమైనా అవకాశం ఉందా అని కూడా చంద్రబాబు ఎంక్వైరీ చేశాడని తెలిసింది. ఇప్పటికే ‘యాత్ర’ సినిమాలో ఏ తెలుగు ప్రముఖ నటుడూ నటించకుండా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు యాత్ర సినిమా రిలీజ్, ప్రొడక్షన్ అడ్డుకునేలా ఏమైనా వ్యూహాలు రచిస్తాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -