Monday, April 29, 2024
- Advertisement -

నేను అఫ్గానిస్తాన్ పౌరుడిగా గర్వపడుతున్నాను..భార‌త పౌర‌స‌త్వంపై ర‌షీద్ ఖాన్ స్పంద‌న‌

- Advertisement -

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్. ఇప్పుడు అత‌నో డైన‌మిక్ ఆల్‌రౌండ‌ర్‌. ఇప్పుడు హ‌ట్‌టాఫిక్ అయ్యాడు. న అద్భుత స్పిన్‌ మ్యాజిక్‌కు తోడు, మెరుపు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌తో ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అతడికి భారత క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు. క్రికెట్ దిగ్గ‌జాలు కూడా ర‌షీద్‌పై ప్ర‌శంశ‌లు కురిపించారు.

ఏకంగా అతినికి భార‌త పౌర‌స‌త్వం ఇవ్వాల‌ని నెటిజ‌న్లు సోషియ‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘని కూడా స్పందించిన విషయం తెలిసిందే.

దీనిపై అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అతీఫ్ మషల్ ఓ ట్వీట్‌ చేశాడు. ‘‘రషీద్‌ ఖాన్ కోసం ఆఫర్ చేస్తున్నవారందరికీ థ్యాంక్స్. ప్రపంచ వ్యాప్తంగా అతడికెంత డిమాండ్ ఉందో నాకు తెలుసు. కానీ, అతడు ఎక్కడికీ వెళ్లడు. ఎందుకంటే.. అతడు అఫ్గానిస్తాన్ దేశస్థుడిగానే గర్వపడుతున్నాడు’’ అని ట్వీట్ చేశాడు.

అందుకు రషీద్ ఖాన్ బదులిస్తూ ..‘ఖచ్చితంగా.. మిస్టర్ చైర్మన్. నేను అఫ్గానిస్తాన్ పౌరుడిగా గర్వపడుతున్నాను. నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. నా దేశం కోసం పోరాడుతాను. మేము శాంతిని వ్యాప్తి చేయాలనుకుంటున్నాం.. ఎందుకంటే అది మా దేశానికి చాలా అవసరం’ అంటూ రషీద్ బదులిచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -