Tuesday, May 21, 2024
- Advertisement -

కత్తిలాంటోడు పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది!

- Advertisement -

సుప్రీం హీరో మెగాస్టార్‌ చిరంజీవిని మళ్లీ వెండితెరపై చూడాలన్న మెగా అభిమానుల కోరిక త్వరలో నెరవేరబోతోంది. చిరు కథానాయకుడిగా నటించనున్న 150వ చిత్రానికి రంగం సిద్ధమైనా ప్రారంభం ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సగటు అభిమాని ఆశ తీరబోతోంది.

తమిళంలో విజయ్‌ నటించిన ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిరు తాజా చిత్రాన్ని ప్రారంభించేందుకు ఈనెల 29న మధ్యాహ్నం 1.30 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ సినిమాకు ప్రస్తుతం ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.

ఇక ఒక అభిమాని అయితే ఏకంగా ఓ పోస్టర్ ని రెడీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.. ఆ పోస్టర్ సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తోంది. బ్లాక్ షేడ్  తో  రూపొందిన ఈ పోస్టర్ వైరల్ లా పాకిపోయింది. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -