Sunday, May 5, 2024
- Advertisement -

‘సైరా’కు సంక్రాంతి విరామం

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా గురించి ఎన్ని పుకార్లు వ‌స్తున్నాయో.. ఎన్ని విష‌యాలు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయో లెక్క‌నే లేదు. ద‌ర్శ‌కుడు, విల‌న్‌, సంగీత ద‌ర్శ‌కుడు, న‌టీన‌టుల ఎంపిక ఇలా అన్నింటా వివాదాలు చోటుచేసుకున్నాయి. ఏమున్నా ఈ సినిమా షూటింగ్ కొన‌సాగుతోంది. రామ్‌చ‌ర‌ణ్ నిర్మాణంలో ఈ సినిమాను జాతీయ స్థాయిగా తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు.

నయనతార, అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌ కీలక పాత్రల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు సంక్రాంతి సెల‌వులు ఇచ్చారంట‌. హైదరాబాద్‌లో పదిరోజుల పాటు షూటింగ్‌ సాగింది. యాక్షన్‌ దృశ్యాల‌ను షూటింగ్ చేశారంట‌. వీటి త‌ర్వాత ‘సైరా’ సినిమా బృందానికి సంక్రాంతి సెలవులు ఇచ్చేశారంట‌. సెల‌వుల అనంత‌రం షూటింగ్‌ మళ్లీ ఫిబ్రవరిలో ప్రారంభిస్తారంట‌. ఆ త‌ర్వాత చిత్రబృందం పొలాచ్చిలో షూటింగ్ చేయ‌నున్నారు. రెండు వారాల పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమా ఇది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వ‌స్తున్న ఈ సినిమాను రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -