Sunday, April 28, 2024
- Advertisement -

మళ్లీ తాత అయిన చిరంజీవి

- Advertisement -

ఈ ఏడాది క్రిస్మస్ మెగాస్టార్ చిరంజీవి ఇంట పండగను రెట్టింపు చేసింది. ఆయన ముద్దుల కుమార్తె శ్రీజ ఈరోజు డిసెంబర్ 25 (మంగళవారం ) ఉదయాన్నే ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ఆ సంతోషాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమ కుమార్తె కాలిముద్ర ఉన్న ఫొటోను కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఆయన షేర్ చేసుకున్నారు. 2018 క్రిస్మస్ తమకు చాలా చాలా ప్రత్యేకమైనదని, జీవితాంతం గుర్తుండిపోతుందని కళ్యాణ్ దేవ్ సంతోషం వ్యక్తం చేశారు. విజేత సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ప్రస్తుతం రెండో సినిమా ఆలోచనల్లో ఉన్నారు.

ఆ సినిమా కోసమే ఇటీవల చిత్ర యూనిట్ ప్రముఖ హాట్ బ్యూటీ మెహ్రిన్ ను సంప్రదించింది. కళ్లు తిప్పుకోలేని అందం, అభినయం ఉన్నా, అదృష్టం కలిసిరాక, సరైన హిట్లు లేక మెహ్రిన్ కెరీర్ కాస్త నిరాశగా సాగుతోంది. దీంతో 70 లక్షల పారితోషికం ఇస్తే దేనికైనా రెడీ అని మెహ్రిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. లిప్ లాకులు, బికినీ సీన్లు, ఇలా దేనికైనా సై అంటూ డోర్లు తెరిచేసింది. కానీ కళ్యాణ్ దేవ్ లాంటి గుర్తింపు లేని, చిన్న హీరోతో మాత్రం చేయలేనని తేల్చి చెప్పేసింది. దీంతో మెగా ఫ్యామిలీ ఆమెపై పగ పట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. తమకు తెలిసిన నిర్మాతలందిరీకీ స్వయంగా చిరంజీవే ఫోన్లు చేసి మరీ మెహ్రీన్ కు అవకాశాలు ఇవ్వవద్దని చెప్పుకొస్తున్నారట.

అయితే తన మామ మెగాస్టార్ తో పాటు మెగా ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీని శాసిస్తున్నా తన పక్కన నటించడానికి మెహ్రిన్ లాంటి ముద్దుగుమ్మ నో చెప్పేసరికి కళ్యాణ్ దేవ్ తీవ్ర నిరాశకు గురయ్యాడని తెలుస్తోంది. ఫస్ట్ సినిమా ఫ్లాప్ కావడంతో డిప్రెషన్ లోకి పోయిన అతడు, మెహ్రిన్ లాంటి అందగత్తెతో నటించి రెండో సినిమాతో అయినా హిట్ కొడదామని భావించాడు. ఆమె కాదనేసరికి మళ్లీ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని టాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలోనే అతడి భార్య శ్రీజ పండంటి పాపకు జన్మనివ్వడంతో ఆ ఆనందంలో డిప్రెషన్ నుంచి బయటపడినట్లేనని సినీవర్గాలు భావిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -