Saturday, May 18, 2024
- Advertisement -

ఏపీలో సంచ‌ల‌న ఫ‌లితాల‌ను వెల్ల‌డించిన రిప‌బ్లిక్ టీవీ..వైసీపీకీ ఎన్ని ఎంపీ సీట్లంటే..?

- Advertisement -

పాద‌యాత్ర‌లో దూసుకుపోతున్న వైఎస్ జ‌గ‌న్‌కు రిప‌బ్లిక్ టీవీ స‌ర్వే షాక్ ఇచ్చింది. మ‌రో సారి ఏపీ స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది.తాజా రిప‌బ్లిక్ టివి సర్వే ప్ర‌కారం ఏపి లో వైసిపి దే పైచేయి గా క‌నిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ -టిడిపి మ‌ధ్య పొత్తు మాత్రం జ‌గ‌న్‌కి కొంత అడ్డంకిగా మారింది. ఏపిలో పార్టీల బ‌లాబ‌లాల పై సీ ఓటర్‌తో కలిసి రిపబ్లిక్ టీవీ ప్రీ-పోల్ సర్వే నిర్వహించి సర్వే ఫలితాలను వెల్లడించిం ది. ఈ ప‌లితాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌ధాన పాత్ర పోషించాల‌ని అడుగులేస్తున్న చంద్ర‌బాబుఈ ఎన్నిక‌ల్లో త‌న బ‌లం చాటుకోవాల‌ని చూస్తున్నారు. మ‌రో వైపు జ‌గ‌న్ కూడా ఎక్క‌వ ఎంపీ సీట్లు సాధించి త‌న స‌త్తా చాటాల‌ని చూస్తున్నారు. తెలంగాణాలో మాదిరి కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుపైనే రిప‌బ్లిక్ టీవీ స‌ర్వే నిర్వ‌హించింది.

రిప‌బ్లిక్ టివి స‌ర్వే ప్ర‌కారం ఏపిలో మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల‌కు గాను..వైసిపి 14 సీట్లు గెలుస్తుంద‌ని అంచ‌నా కు వ‌చ్చారు. అదే విధంగా టిడిపి – కాంగ్రెస్ పొత్తు తో ఎన్నిక‌లకు వెళ్తే 11 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని పేర్కొంది. అందులో భాగంగా..టిడిపి 8 స్థానాలు.. కాంగ్రెస్ 3 సీట్లు గెలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు రిపబ్లిక్ టీవీ ప్రీ-పోల్ సర్వే వెల్లడించింది.

ఒక వేళ‌ పొత్తు లేకుంటే ఫ‌లితాలు వేరే విధంగా ఉంటాయ‌ని తెలిపింది. గ‌తంలో ఇదే రిప‌బ్లిక్ స‌ర్వేలో వైసీపీకీ 21 సీట్లు, టీడీపీకీ 4 సీట్లు వ‌స్తాయ‌ని స‌ర్వేలో తేలింది. మొన్నటి వరకు వైఎస్ జగన్‌కి అనుకూలంగా ఉందని, తీర్పు ఏకపక్షమేనని అంచనా వేసినా కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టిన తర్వాత చంద్రబాబు మళ్లీ లైన్‌లోకి వచ్చారని తెలిపింది.

రెండు నెలలు తిరక్కముందే పరిస్థితి అనూహ్యంగా తారుమార‌య్యింది. టీడీపీ తన స్థానాలకు 8కి పెంచుకోవడమే కాదు, మిత్రపక్షం కాంగ్రెస్‌తో కలిసి మొత్తం 11 సీట్లను గెలుచుకోనుందని అంచనా వేసింది. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నందున స‌ర్వే ఫ‌లితాల్లో మార్పులు చోటు చేసుకొనే అవ‌కాశంఉంది. వారం వారం రిప‌బ్లిక్ టీవీ త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తుంది. ఏది ఏమైనా వైఎస్ జ‌గ‌న్ స‌ర్వేల‌ను న‌మ్ముకోకుండా త‌న సొంత బ‌లాన్ని న‌మ్ముకొని వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్లాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -