Monday, April 29, 2024
- Advertisement -

ఆ విషయం లో నిరుత్సాహం గా ఉన్న చిరంజీవి

- Advertisement -

ప్రస్తుతం సినిమా పరిశ్రమ లో అందరూ ఎంతగానో ఆత్రుత గా ఎదురు చూస్తున్న సినిమా సై రా నరసింహా రెడ్డి. మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర లో రానున్న ఈ సినిమా అందరినీ ఎంతగానో అలరిస్తుంది అనే టాక్ నడుస్తుంది. ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా ఈ సినిమా ని నిర్మిస్తున్నారు రామ్ చరణ్. సురేందర్ రెడ్డి ఈ సినిమా కి దర్శకుడు. ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అవుతుంది. కానీ ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు ఇంకా అయిపోలేదు. పైగా అందులో కొంత ఆలస్యం జరుగుతుంది అని టాక్ నడుస్తుంది పరిశ్రమ లో.

సినిమా లో చాలా పోరాట సన్నివేశాలు ఉంటాయట. సురేందర్ రెడ్డి వాటిని అద్భుతంగా తెరకెక్కించారట కానీ మంచి గ్రాఫిక్స్ కూడా తోడైతే నే అవి సినిమా స్క్రీన్ మీద పండుతాయట కానీ ఇప్పుడు చేస్తున్న టీమ్ సంతృప్తి కరమైన వర్క్ ని అందివ్వడం లేదని తెలుస్తుంది. ఆ విషయం లో మాత్రం చిరంజీవి అసంతృప్తి గా ఉన్నారట. ఒక వైపు సినిమా విడుదల తేదీ ప్రకటించాలని ప్రెజర్ ఉండటం, ఇంకో వైపు ఔట్పుట్ నిరాశాజనకం గా ఉండటం చిరంజీవి కి నచ్చడం లేదని ప్రచారం సాగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -