Sunday, May 5, 2024
- Advertisement -

చిరంజీవి అభిమానులకు తీవ్ర నిరాశ.. దిక్కుతోచని పరిస్థితి!

- Advertisement -

ఆగస్టు 22 వ తేదీ గురించి మెగాస్టార్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు మొన్నటి వరకూ. ఈ సారి మెగాస్టార్ బర్త్ డేను చాలా గ్రాండ్ గా నిర్వహించాలని.. దీంతో రాష్ట్రం మొత్తం మోతెక్కిపోవాలని వారు భావించారు.

అందుకోసం రకరకాలుగా ప్లాన్ చేసుకొన్న వారికి ఇప్పుడు తీవ్ర నిరాశే మిగలింది. ఈ సారి చిరంజీవి పుట్టిన రోజును గ్రాండ్ గానిర్వహిద్దామని అనుకోవడం వెనుక బలమైన రీజన్ ఉంది. అదేమంటే.. చిరంజీవి 150 వ సినిమా!

రాజకీయాల నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చేయడంలో భాగంగామెగాస్టార్ 150 సినిమాలో నటించడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నాడని.. అందులో భాగంగా కథలు వింటున్నాడని చాలా రోజులుగా… ఇంకా చెప్పాలంటే చాలా సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. ఆలాంటి ఆశలను మరింతగా పెంచాడు పూరీ జగన్నాథ్. చిరంజీవికి కథ చెప్పానని.. తొలిసగం అదిరిపోయిందని పూరీ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానుల్లో ఆశలు పెరిగాయి.

ఈ సారి చిరంజీవి పుట్టిన రోజు న సినిమా ప్రారంభం అవుతుందని… వారు ఆశల్లో బతికారు. అయితే చివరకు మాత్రం నిరాశే మిగలింది! ఆగస్టు 22వ తేదీన చిరంజీవి 150 సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఏ మాత్రమూ లేవని స్పష్టం అవుతోంది. అంతే కాదు.. మరో మూడు నాలుగు నెలల వరకూ కూడా ఈ అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో అన్నయ్య 150 సినిమాకోసం ఎదురుచూస్తున్న తమ్ముళ్లకు ఊసురుమంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -