Thursday, May 9, 2024
- Advertisement -

కిక్- 2 విడుదలకు ముందు బిజినెస్ వివరాలు ఇవే!

- Advertisement -

ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది కిక్-2. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాకు మరో హీరో కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిచండం మరింత ఆకర్షణీయమైన అంశం.

ఇక కిక్ సినిమా సూపర్ హిట్ కాబట్టి.. దానికి సీక్వెల్ అనే పేరును తెచ్చుకొన్న ఈ సినిమాకు మరింత క్రేజ్ ఉండనే ఉంది. రవితేజకు ఉన్న ఫ్యాన్ బలగం ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది కూడా!

మరి ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. విది దాదాపు 27.50 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసిందని భోగట్టా. నైజాం ఏరియాలో ఎనిమిది కోట్లకు, సీడెడ్ లో నాలుగు కోట్ల రూపాయలకు, ఏపీలో పది కోట్ల రూపాయలకు, కర్ణాకటలో 2.80 కోట్లకు, రెస్టాప్ ఇండియా 50 లక్షల రూపయాలకు, ఓవర్సీస్ లో 2.20 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యిందట రవితేజ సినిమా. ఈ విధంగా మొత్తం 27.50 కోట్ల రూపాయల మార్కెట్ ను చేసిందని సమాచారం.

మరి ఇది రవితేజ సినిమా వరకూ సేఫ్ జోనే. ఎలాగూ శాటిలైట్ రైట్స్ ఉండనే ఉంటాయి కాబట్టి.. ఈ మాత్రం బిజినెస్ నిర్మాత కల్యాణ్ రామ్ కు ఊరటనిచ్చే అంశమే. మరి విడుదల తర్వాత కొన్నవారికి ఈ సినిమా ఏ మేరకు లాభాలు తెచ్చిపెడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. గణాంకాలను బట్టి చూస్తే మాత్రం ఈ సినిమాను కొన్నవాళ్లుకూడా సేఫ్ జోన్ లో ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -