Friday, May 17, 2024
- Advertisement -

కత్తిలాంటోడు సినిమా ఫస్ట్ టీజర్??

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరినోట విన్న బాస్ ఈజ్ బ్యాక్ అనే పదమే వినిపిస్తోంది. ఇటివలే చిరు 150వ సినిమా షూటింగ్ కూడా మొదలు అయ్యింది. ఇక ఈ చిత్రం గురించి రోజుకో వార్తతో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే కత్తిలాంటోడు అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చిరు పక్కన నటించబోయే హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంక క్లారిటీ ఇవ్వలేదు చిత్ర యూనిట్.

ఇక ఈ చిత్రాన్ని ‘కొణిదెల ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై రామ్ చరణ్ తేజ్ స్వయంగా నిర్మించడం మరో విశేషం. ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం కత్తి కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ కత్తిలాంటోడు చిత్రం గురించి ఇప్పుడూ అభిమానులకు ఓ శుభవార్త  వచ్చింది. అదే కత్తిలాంటోడు సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ డేట్. అవును ఇది నిజమే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ టీజర్‌ను ఆగష్టు నెల 22న విడుదల చేయడానికి రెడీ అయ్యారట చిత్ర యూనిట్.

ఆ రోజే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో మెగా అభిమానులకు పుట్టిన రోజు గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది కత్తిలాంటోడు టీమ్. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న చిరు 150వ సినిమా టీజర్ అనుకున్న టైం కి రిలీజ్ చేయడంలో సక్సెస్ అయితే ఇక టాలీవుడ్‌లో ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చిరు 150వ సినిమా టీజర్ టాపిక్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -