Monday, May 12, 2025
- Advertisement -

ఖైదీ నంబర్ 150 ఫస్ట్‌డే కలెక్షన్స్‌ తెలిస్తే షాక్ అవుతారు!

- Advertisement -
chiranjeevi khaidi no 150 movie shocking collections

దాదాపు 9 సంవత్సరాల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి  ‘ఖైదీ నెం.150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. భారీ స్థాయి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంది. ఇక ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూళ్లు చేస్తుందా అని గత కొన్ని వారాలుగా మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మెగా అభిమానులు ఆశించినట్లుగానే ఖైదీ నెం.150 చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ను సాధించింది. ఒక సౌత్‌ సినిమా ఒకే భాషలో విడుదలై ఏకంగా 30 కోట్లు మొదటి రోజు వసూళ్లు చేయడం పెద్ద సంచలనం. 30 కోట్లు వసులు చేసి టాలీవుడ్ టాప్ సినిమాల జాబితాలో చేరిపోయింది. బాహుబలి ఇంతకు మించి వసూళ్లు చేసింది. అయితే అది ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ మరియు మలయాళంలో కూడా విడుదలైంది.

అందుకే ఖైదీ సినిమా ఓపెనింగ్స్‌ చూసి టాలీవుడ్‌ ట్రేడ్‌ పండితులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక తలపండిన సినీ దిగ్గజం అయిన అల్లు అరవింద్‌ కూడా మెగా ఓపెనింగ్‌ను చూసి అవాకయ్యాడటఖైదీ సినిమాకు 20 కోట్ల వరకు మొదటి రోజు కలెక్షన్స్‌ వస్తాయని అల్లు అరవింద్‌ అంచనా వేశాడట. అయితే మెగా నిర్మాత అంచనాలను తలకిందులు చేసి అదిరిపోయే కలెక్షన్స్‌ను ఖైదీ తీసుకు వచ్చాడు. ఇక లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం వంద కోట్ల మార్క్‌ను దాటేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Related

  1. ఖైదీ నంబర్ 150 చిత్రం రివ్యూ 
  2. ఖైదీ నంబ‌ర్ 150 లో అతి పెద్ద మైనస్ ఇదే!
  3. ఖైదీ సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!
  4. షాకింగ్: అప్పుడే నెట్ లో హల్ చల్ చేస్తున్న ఖైదీ నంబర్ 150

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -