Wednesday, May 15, 2024
- Advertisement -

ఖైదీ నంబర్ 150 చిత్రం రివ్యూ 

- Advertisement -
Chiranjeevi’s 150th Movie ‘Khaidi no 150’ Review

బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కత్తి రీమేక్ ని చిరంజీవి రీమేక్ చెయ్యడానికి పూనుకున్న టైం లోనే అందరికీ ఒకరకమైన ఉత్సాహం కలిగింది. సంక్రాంతి బరిలో దిగిన చిరంజీవి ఎన్ని రికార్డుల వేటలు వేస్తాడు అనేది ఇంకా తెలియాల్సి ఉన్న టైం లో .. ఖైదీ 150 చిత్రం రివ్యూ ఎలా ఉందొ చూద్దాం

కత్తి శీను అనే ఒక తెలివైన ఖైదీ (నం 150) తన టాలెంట్ తో వేరొక ఖైదీ ని పట్టుకోవడం కోసం పోలీసులకి సహాయం చేసి ఆ గోలలో తాను తప్పించుకుంటాడు. రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లాలో నీరూరు అనే ఊర్లో ఖైదీ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ గ్రామంలో రైతులు వ్య‌వ‌సాయాన్నే న‌మ్ముకుని జీవిస్తుంటారు. ఆ గ్రామంలో భూములు స్వాధీనం చేసుకోవాల‌ని ట్రై చేస్తోన్న కార్పొరేట్ శ‌క్తుల‌కు అగ‌ర్వాల్ (త‌రుణ్ అరోరా) నాయ‌క‌త్వం వ‌హిస్తుంటాడు. రైతుల‌ను చంపేసి వారి శ‌వాల నుంచి వేలిముద్ర‌లు తీసుకుని వారి సాగు భూములు వారికి తెలియ‌కుండానే స్వాధీనం చేసుకుంటాడు. దీంతో ఒకేసారి ఆరుగురు రైతులు గ్రామం కోసం లైవ్ వీడియో తీయించుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటారు. ఆ న్యూస్‌తో నీరూరు రైతుల పోరాటం వెలుగులోకి వ‌స్తుంది. ఆ గ్రామానికి చెందిన కొణిదెల శివ‌శంక‌ర్ ప్ర‌సాద్ అలియాస్ శంక‌ర్ (చిరంజీవి) రైతుల త‌ర‌పున పోరాటం చేస్తుంటాడు. దీంతో శంక‌ర్ నీరూరుకు చెందిన వృద్ధుల‌ను హైద‌రాబాద్‌కు తీసుకువ‌చ్చి, అక్క‌డ హైకోర్టులో వారి త‌ర‌పున పోరాటం చేస్తుంటాడు. ఈ స్టోరీ లోకి మన కత్తి శీను ఎలా దూరాడు వారితో ఎలాంటి సంబంధం ఏర్పడింది అనేదే కథ .. రైతుల తరఫున అతనెలా పోరాటం చేసాడు అనేది ఆసక్తికరం .. సినిమాకి మెయిన్ హై లైట్ గా కథ గురించి చెప్పుకోవాలి. ఒక మంచి సామాజిక స్పృహ ఉన్న కథ తో రైతు లేకపోతే మనం లేము అనే కథని రాసిన మురుగదాస్ ని ఈ సందర్భంగా మెచ్చుకుని తీరాలి . ఆ తరవాత చిత్రాన్ని తన భుజాల మీద మోసిన చిరు ని హై లైట్ గా చెప్పి తీరాలి . తొమ్మిది సంవత్సరాల తరవాత రీ బ్యాక్ అయినా కూడా ఎక్కడ బెణక కుండా తన నట అంటే ఏంటో చూపించాడు చిరంజీవి. పవర్ ఫుల్ ఎపిసోడ్ ల దగ్గర నుంచీ ఎమోషనల్ సీన్ ల వరకూ తన రేంజ్ ని మళ్ళీ ఒక్కసారిగా  చూపించేసాడు. డాన్స్ ల విషయం లో చిరంజీవిని కొట్టే హీరో ఇంకా పుట్టలేదు అనిపించేలా అదిరిపోయాయి డాన్స్ లు కూడా. కామెడీ విషయం లో కూడా అంతే . ఇంటర్వెల్ బ్లాక్ , టన్నెల్ సీన్ , కాయిన్ ఫైట్ , ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు బెస్ట్ సీన్ లు . 

కాజల్ కేవలం గ్లామర్ కీ సాంగ్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది. కామెడీ ని ఇరికించి పెద్ద తప్పు చేసాడు డైరెక్టర్ వినాయక్ . బ్రహ్మానందం కామెడీ అసలు వర్క్ అవ్వలేదు. పూర్తిగా కత్తి ని మక్కీకి మక్కీ దించెయ్య కుండా కాస్తంత మార్పులు చెయ్యడం చాలా పెద్ద తప్పు అయ్యింది. క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకి పెద్ద తలనొప్పి. లాస్ట్ లో వచ్చే ఫైట్ చాలా వరస్ట్ గా సాగింది. కోర్టు బయట సీన్ , ఇద్దరు చిరంజీవి ల సీన్ లు పేలవంగా ఉన్నాయి. వినాయక్ మురుగదాస్ రేంజ్ లో స్క్రీన్ ప్లే నడిపించలేక పోయాడు. 

మొత్తంగా : మొత్తం మీద చూసుకుంటే ఖైదీ నెంబర్ 150 స్క్రీన్ ప్లే అటూ ఇటూ గా ఉన్నా , అక్కరలేని సీన్ లు ఉన్నా చిరంజీవి తన గ్రేస్ తో ఈ సినిమాని లాగేసాడు అని చెప్పాలి. సినిమా యావత్తూ తన భుజాల మీద వేసుకుని నడిపించాడు. కామెడీ, క్లిమాక్స్ వీక్ పాయింట్ లు పక్కన పెడితే మురుగదాస్ రాసిన కథే ఈ సినిమాకి అతిపెద్ద బలం. రైతుల కష్టాలు పట్టణం వారికి అర్ధం అయ్యేలా చెప్పే ఈ స్టోరీ లో మనందరం నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఫ్రెండ్స్ ఫామిలీ తో వారాంతం లో ఫుల్లుగా మీరు ఎంజాయ్ చెయ్యదగ్గ సినిమా అవుతుంది .. తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో తాను ఎప్పటికీ ఒక ఖైదీ నే అని ఈ సూపర్ హిట్ తో నిరూపించుకున్నాడు చిరంజీవి.

{youtube}Wy93W-y4vdY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -