Friday, May 3, 2024
- Advertisement -

సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న చిరు?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో సినిమా ప్లాన్ చేసారని కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్ట్ 11, 2023న విడుదలకు సిద్ధం అవ్వుతుంది. ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత చిరంజీవి కళ్యాణ్ కృష్ణతో చిత్రాన్ని ప్రారంభించి, సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, 2024 సంక్రాంతి నుండి నిష్క్రమించినట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుందని సంక్రాంతికి రావడం అసాధ్యం అని తెలుస్తుంది. కళ్యాణ్ కృష్ణతో చిరంజీవి సినిమా వేసవికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది.

వాల్తేరు వీరయ్య తర్వాత చాలా సమయం తీసుకున్న చిరంజీవి చాల స్క్రిప్ట్‌లు విన్నారు. అయితే కళ్యాణ్ కృష్ణతో పాటు బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట సినిమాను అంగీకరించాడు. ఈ రెండు సినిమాలకు ఏకకాలంలో వర్క్ చేస్తాడని అంటున్నారు. మల్లిడి వశిష్ట ప్రాజెక్ట్ ను మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ముల్లోక వీరుడు అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సోషియో-ఫాంటసీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్‌ ను యువి క్రియేషన్స్ బ్యానర్‌ అందించనుందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -