అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల పాన్ ఇండియా సినిమాపై అందరి దృష్టి

Allu Arjun and Trivikram Srinivas reunite for their 4th film
Allu Arjun and Trivikram Srinivas reunite for their 4th film

టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర పరిశ్రమలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి అల్లు అర్జున్ పుష్ప 2. మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేయడంతో పుష్ప 2 సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ హైప్ ఉంది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత ప్రాజెక్ట్ పై చాలా ఊహాగానాలు వచ్చాయి చివరికి త్రివిక్రమ్ తో ఫైనల్ అయింది. #AA22 అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమా అలా వైకుంఠపురం తో పాటు జులాయి, S/o సత్యమూర్తి వంటి హిట్ చిత్రాలను అందించారు. మరోసారి వీరి కలయిక పై అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటిస్తున్న గుంటూరు కారం తెరకెక్కుతుంది. ఈ సినిమా మొదటి నుండి వాయిదా పడుతూ, మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పడు షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది.

ఇప్పటికే పాన్-ఇండియా స్టార్‍గా అల్లు అర్జున్‍కి గుర్తింపుఉంది. అయితే త్రివిక్రమ్‌కి ఇది మొదటి పాన్-ఇండియా ప్రాజెక్ట్. త్రివిక్రమ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలేవీ చేయలేదు. ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటు నుంచి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ వస్తున్న నాలుగో సినిమాపై అందరి దృష్టి పడింది.