Monday, April 29, 2024
- Advertisement -

చిరు వాలెంటైన్‌ డే టూర్!

- Advertisement -

వాలెంటైన్స్ డే..ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. ప్రేమికులకే ప్రేమతో జీవించే ప్రతి ఒక్కరికి స్పెషలే. అందుకే ప్రతి ఒక్కరూ తాము ప్రేమించే వారికి స్పెషల్ వాలెంటైన్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రేమికుల రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

తన భార్య సురేఖ కొణిదెలతో కలిసి టూర్ ప్లాన్ చేసినట్టుగా చెప్పారు మెగాస్టార్. ఇందుకు సంబంధించిన న్యూస్‌ని సోషల్ మీడియా ద్వారా చెప్పిన చిరు.. నా బెటర్ హాఫ్ సురేఖతో ఒక చిన్న సెలవు కోసం అమెరికాకు బయలుదేరాను అని చెప్పుకొచ్చారు. తిరిగి వచ్చిన వెంటనే విశ్వంభర షూటింగ్‌లో జాయిన్ అవుతానని తెలిపారు.

మీ అందరినీ త్వరలో కలుస్తాను. అలాగే అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సురేఖతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం చిరు…వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -