Tuesday, May 7, 2024
- Advertisement -

టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్ రెడీ..డేట్ ఫిక్స్!

- Advertisement -

ఎట్టకేలకు టీడీపీ – బీజేపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రెడీ అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అనేక దఫాల చర్చల అనంతరం పవన్‌ పార్టీతో పొత్తు ఓ కొలిక్కిరాగా బీజేపీ ఎంట్రీతో లిస్ట్ కాస్తా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ రెండు పార్టీల నేతల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీతో పొత్తు అంశాన్ని పక్కనపెట్టి వారం రోజుల్లోనే ఫస్ట్ లిస్ట్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు టీడీపీ – జనసేన నేతలు.

అయితే ఎన్నికల రణరంగంలో వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటివరకు సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా వారు ఎన్నికల రణరంగంలో దూసుకుపోతున్నారు. అయితే టీడీపీ – జనసేన లిస్ట్ మాత్రం ఆలస్యం అవుతుండటంతో నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

బీజేపీతో పొత్తులపై ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఆపార్టీ ఆశీంచే సీట్లను పక్కనపెట్టి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేలా పవన్ – చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, సర్వే రిపోర్టుల ఆధారంగా ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన సంయుక్తంగా తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ లిస్ట్‌లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా టీడీపీ ఫస్ట్ లిస్ట్ విడుదల అవుతుందని ప్రచారం జరుగుతుండగా దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -