Friday, March 29, 2024
- Advertisement -

సల్లూభాయ్, చిరు కాంబినేషన్‌లో మూవీ

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ముంబై లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి విచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి పుష్ప‌గుచ్చంతో స‌ల్మాన్‌కు స్వాగతం పలికారు. ‘గాడ్‌ఫాదర్, భాయ్ సల్మాన్ ఖాన్‌కి స్వాగతం! మీ ప్రవేశం ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహం తదుపరి స్థాయికి వెళ్లింది. మీతో స్క్రీన్‌ను పంచుకోవడం ఒక సంపూర్ణమైన ఆనందం. మీ ఉనికి ప్రేక్షకులకు ఆ అద్భుత కిక్‌ ని ఇస్తుందనడంలో సందేహం లేదు.’ అని చిరంజీవి పోస్ట్‌ చేశారు.

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ బాణీలు అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -