ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

- Advertisement -

దక్షిణాదిలో ఒక్కసారి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటే చాలు హీరోయిన్ల రెమ్యూనరేషన్‌కు రెక్కలొచ్చేస్తాయి. ఇప్పుడైతే స్టార్ హీరోయిన్లతో ఐటమ్స్ సాంగ్స్ ట్రెండ్ బాగా కనిపిస్తోంది. పుష్ప సినిమాలో ఊ అంటావా అని ప్రేక్షకులను ఉత్తేజపరిచిన సమంత ఆ సాంగ్ కోసం కోటిన్నర పారితోషకం తీసుకుంది. ‘గని’ చిత్రం కోసం తమన్నా కోటి వరకు వసూల్ చేసినట్లు టాలీవుడ్ టాక్. తాజాగా ఇప్పుడీ జాబితాకు రష్మిక పేరు వచ్చి చేరింది.

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్‌లో ‘యానిమల్’ పేరుతో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు సమాచారం. ఆ పాటను దక్షిణాదికి చెందిన కేజ్రీ హీరోయిన్‌తో చేయించాలని సందీప్ భావిస్తున్నాడట. ఈ సాంగ్ కోసం రష్మికా మందన్నను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ఐటమ్ సాంగ్ చేయడానికి రష్మిక ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం.

- Advertisement -

రష్మిక ఒక్కో సినిమాకు ప్రస్తుతం రూ. 2కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. సినిమాకు 30 రోజుల వరకు కాల్షీట్స్ ఇస్తోంఇ. అదే ఐటెమ్ సాంగ్ అయితే ౩ రోజుల నుంచి ఐదు రోజులేనట. అయితే సినిమా కంటే ఐటమ్ సాంగ్‌కే ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఐటమ్ సాంగ్‌కు రష్మిక రెండు కోట్లు డిమాండ్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -